ఎహే పో నా బస్సు అలాగే వుంటాయి ……..మీ సార్లు నాకు దోస్తులే నీకు చేతనైంది చేసుకో …….ఇంకో సారి ఇటు వైపు రావద్దు అంటూ ఓ విద్యాసంస్థల అధినేత ఏకంగా ఓ ఏసీపీ నే ధమ్కీ ఇచ్చిన ఉదంతం ఇది. అసలే కొత్తగా ఏసీపీ బాధ్యతల్లో కి వచ్చిన సదురు ఏసీపీ సైతం ఎదురు మాట్లాడలేక సైలెంట్ గా వచ్చేసాడు.
జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల బస్సుల ఫిట్నెస్ లసంగతి తేల్చాలని పోలీస్ కమిషనర్ స్పెషల్ డ్రైవ్ కు ఆదేశాలు జారీ చేసారు. మెజార్టీ విద్యాసంస్థల బస్సుల నిర్వహణలో బోలెడు లోపాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రతియేటా రవాణా శాఖ నుంచి ఫిట్నెస్ ధ్రువీకరణ చేసుకోవాలి అలాగే ప్రమాదాలు జరిగి నప్పుడు చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లు వుండాలి అలాగే బస్సు నడిపే డ్రైవర్ సైతం ఫిట్ గా వుండాలి ఎలాంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ట్రాఫిక్ సివిల్ పోలీసులు గత మూడు రోజుల క్రితం జిల్లా వ్యాప్తంగా విస్తృతంమైన సోదాలు చేశారు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ మెజార్టీ బస్సుల్లో బోలెడు లోపాలు వెలుగులోకి వచ్చాయి నగరంలో పెద్ద సంఖ్యలో బస్సులున్న ఉన్న ఓ విద్యాసంస్థ బస్సులనిర్వహణ లోపాలు దిద్దు కోవాలని స్వయంగా ఏసీపీ నేరుగా వెళ్లి నగరంలో ఖ్యాతి పొందిన విద్యా సంస్థ ఓనర్ ను కలిశారు.
ఆయన ఆ విద్యా సంస్థా బస్సుల్లో గుర్తించిన లోపాలను ఓనర్ ముందు ఏకరువు పెట్టారు. పాపం ఎప్పుడూ క్షణం కూడా తీరిక లేకుండా ఉండే సదరు యజమాని కి ఏసీపీ సూచనలు తీవ్ర అసహనం తెప్పించాయి.
మాకు ఇవన్నీ కామన్ మీరెందుకు ఉత్సహాం చుపుతున్నారు ఆర్టీవో అధికారులు కదా ఆ పని చుడాల్సింది అంటూ ఎదురు క్లాస్ పీకాడు దీనితో బిత్తర పోయిన ఏసీపీ మరోసారి ఇది స్పెషల్ డ్రైవ్ అంటూ చెప్పబోయాడు.
ఎహే వెళ్ళండి మీ సార్లు నాకు క్లోజ్ ఫ్రెండ్స్ నేను మాట్లాడుతా అంటూ కవిసురుగా అన్నాడు. మీ ఇష్టం సార్ ప్రోసిజర్ చెప్తున్నా అన్నాడు ఎహే మా బస్సులు ఇలాగే ఉంటాయి మీ ఇష్టం ఉంది చెయ్యండి అంటూసవాల్ చేసాడు వామ్మో సదరు ఓనర్ నగరంలో చాల పవర్ ఫుల్ అనుకున్నాడు మెల్లిగా జారుకున్నాడు.
