అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అరిగోస పడాల్సి వస్తున్నది. ఓవైపు సర్కారు జాప్యం, మరోవైపు అకాల వర్షాలతో నిండా మునగాల్సిన దుస్థితి ఏర్పడుతున్నదనీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
శుక్రవారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా అకాలవర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ,అయిన పట్టించుకునే వారు లేరన్నారు.అలాగే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అయిన సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేసే లేదని ఆగ్రహించారు.
ధాన్యం సేకరణలో నయా పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదని కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సేకరణ జరుగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2014 లో కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేదని, ప్రస్తుతం సుమారు 90 మెట్రిక్ టన్నుల ధాన్యంసే సేకరిస్తోందన్నారు.
54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తామని ప్రకటించిన అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకున్నా రైతులకు అండగా ఉన్నామన్నారు. సెంటర్ల లో కనీస వసతులు లేవని, సమగ్ర వ్యవసాయ పాలసీ రూపొందించాలన్నారు.
పంటల మార్పిడి పై ప్రభుత్వం అవగాహన కల్పించాలన్నారు. కేంద్రం సహకారం పూర్తిస్థాయిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేవ్ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ,బీసీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఎంపీ అన్నారు. కేవలం రాజకీయం కోసం బీసీ రిజర్వేషన్లు అంటూ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు చిత్తశుద్ధి ఉంటే బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మూలాకత్ అయ్యారని ఆరోపించారు.
మాధవనగర్ ఆర్వోబీకి సంబంధించి ఇటీవల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిసినట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు. రూ.14 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
