నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య కేసులో నిందితుడు షేక్ రియాజ్ ఎన్ కౌంటర్ వివాదం ఢిల్లీ కి చేరింది. అది కస్టోడియల్ డెత్ అని ఆరోపిస్తూ అతని కుటుంబ సభ్యులు పలు సంస్థలకు పిర్యాదు చేశారు.
ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ మహిళా కమిషన్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
దీనిపై సీబీఐ తో విచారణ జరిపించాలని ప్రజా సంఘాల నేతలతో కలసి రియాజ్ తల్లి జరీనా బేగం, భార్య సనోబర్ నజ్జీన్ వినతిపత్రాలు అందజేశారు.
