Thursday, April 16, 2026
HomeTelanganaNizamabadడీసీసీ ల వీడని ఉత్కంఠ ….. కసరత్తులు పూర్తియినా కొలిక్కి రాని నియామకాలు ……ఆశావహుల్లో అసహనం...

డీసీసీ ల వీడని ఉత్కంఠ ….. కసరత్తులు పూర్తియినా కొలిక్కి రాని నియామకాలు ……ఆశావహుల్లో అసహనం ……..

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కోసం ఎడతెగని కసరత్తులు చేసిన అధిష్టానం నియామకం లో జాప్యం కొనసాగిస్తున్నది. రోజుల తరబడిగా ఉత్కంఠ కొనసాగుతుంది.

జిల్లానుంచి ఢిల్లీ దాక లాబీయింగ్ చేసిన ఆశావహుల్లో అసహనం వ్యక్తం అవుతుంది.పీసీసీ చీఫ్ మహేష్ సొంత జిల్లాలో ఈసారి డీసీసీ పీఠం ఎవరికి దక్కబోతుందోననేది పార్టీవర్గాలకు ఆసక్తిగా మారింది. నిజానికి అక్టోబర్ నెలాఖరు లోగానే డీసీసీ అధ్యక్షుల నియామకం పక్రియ పూర్తీ అవుతుందని పీసీసీ చీఫ్ మహేష్ అనేక మార్లు స్పష్టం చేసారు.

ఆ మేరకే ఏఐసీసీ పరిశీలకుడు రంగంలోకి దిగి శరవేగంగా నే నియోజకవర్గాల వారీగా అభిప్రాయాలను సేకరించారు.. ముగ్గురు పేర్లతో జాబితా అధిష్టానం కు చేరింది. అర డజన్ మంది నేతలు డీసీసీ కోసం అధ్యక్ష పదవి కోసం దరకాస్తు చేసుకున్నారు.. డీసీసీ అధ్యక్షుడి గా ఎవరుండాలనే విషయంలో మహేష్ తో పాటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వర్గీయులే హడావుడి చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి లతో పాటు శేఖర్ గౌడ్ లు డీసీసీ రేసులో చివరి దాక నిలిచారు ఏఐసీసీ కి వెళ్లిన జాబితా లో ఈ ముగ్గురు నేతలే ఉన్నారు. వీరిలో నర్సారెడ్డి నగేష్ రెడ్డి లు సుదర్శన్ రెడ్డి వర్గీయులుగా ముద్ర ఉంది. శేకర్ గౌడ్ ఒక్కరే మహేష్ సన్నిహితుడు.

అందుకే ఈ ముగ్గురి లో డీసీసీ పగ్గాలు ఎవరికీ అప్పగించబోతున్నారనేది ఉత్కంఠ గా మారింది. ఓ దశ లో లోకల్ బాడి ఎన్నికల పక్రియ మొదలయ్యే లోపే డీసీసీ లను ఖరారు చేస్తారని భావించారు. కానీ ఆ ఎన్నికలు ఇప్పట్లో జరిగే పరిస్థితి లేక పోవడంతో అధిష్టానం ఒక్కసారి చల్ల బడిపోయింది.

డీసీసీ ల నియామకాల వ్యవహారం పక్కకు వెళ్ళింది. కానీ నవంబర్ రెండో వారం వచ్చినా అధిష్ఠానం ఉలుకు పలుకు లేకుండా ఉండడం ఆశావహుల్లో అసహనం వ్యక్తం అవుతుంది. లోకల్ ఎన్నికల్లోపే కొత్త డీసీసీ అధ్యక్షుడి నియామకం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!