HomeCRIMEలారీ డ్రైవర్ కు నెల రోజుల జైలు శిక్ష..

లారీ డ్రైవర్ కు నెల రోజుల జైలు శిక్ష..

స్కూల్ బస్సును ఢీ కొట్టిన లారీ డ్రైవర్ కు నెల రోజుల జైలు శిక్ష విధించినట్లు మాక్లూర్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 6 న మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామం పరిధిలో దౌడు బైగ్ తన లారీని నిర్లక్ష్యంగా నడపడంతో ఎదురుగా వెళ్తున్న స్కూల్ బస్సుకు వెనుక నుండి ఢీకొన్నాడనీ తెలిపారు. ఈ ఘటనపై మాక్లూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ మేరకు ఆ లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు నిర్ధారణ కావడంతో, అతనిపై డ్రంకెన్ డ్రైవింగ్ కేసు చేసి స్పెషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, కోర్టు లారీ డ్రైవర్ కు ఒక నెల (30 రోజులు) జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయనీ మాక్లూర్ ఎస్ఐ రాజశేఖర్ హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments