HomeLaw and Orderత్రాగునీరు రావడంలేదని కాలనీవాసుల నిరసన..

త్రాగునీరు రావడంలేదని కాలనీవాసుల నిరసన..

నిజామాబాద్ నగరంలోని 80 క్వార్టర్స్ పరిధిలో త్రాగునీరు రావడంలేదని కాలనీవాసులు నిరసనకు దిగారు. గత వారం రోజుల నుంచి నీటి ఎద్దడి ఉందని కాలనీ వాసులు పేర్కొన్నారు. కనీసం నీటి ట్యాంకులు గాని ఎటువంటి ప్రత్యమ్నయం చేయకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ మేరకు శుక్రవారం నాగారంలోని మెయిన్ రోడ్ లో డ్రమ్ములు అడ్డుపెట్టి మహిళలు కాలనీవాసులు అందరూ ధర్నాకు దిగారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ప్రజలను మెప్పించే ప్రయత్నం చేశారు.

మున్సిపల్ నీటిపారుదలకు సంబంధించిన జవాన్ అమీన్ ని పిలిపించి ఆ సమస్యపై వారికి హామీ ఇప్పించారు. తాత్కాలికంగా నీటి ట్యాంకుల ద్వారా వారికి నీటిని అందించి రెండు రోజులలో నీళ్లు వచ్చే విధంగా చేస్తామని మున్సిపల్ జవాన్ హామీ ఇచ్చారు.

ఈ సమస్యను వెంటనే పరిష్కరించినట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రజలు తెలిపారు.సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ రాంబాబు ప్రత్యేక చొరువ చూపినందుకు ప్రజలందరూ ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments