Thursday, April 16, 2026
HomeCRIMEబెట్టింగ్ దందాల కోసం అద్దె అకౌంట్ .......అమాయక యువకులకు కాసుల ఎర.......

బెట్టింగ్ దందాల కోసం అద్దె అకౌంట్ …….అమాయక యువకులకు కాసుల ఎర…….

జిల్లాలో బెట్టింగ్ ముఠాల ఆగడాలు యదేచ్చగా సాగుతున్నాయి. బెట్టింగ్ దందాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. బెట్టింగ్ ముఠాలు బ్యాంక్ ఖాతాలను అద్దె లకు తీసుకుంటున్నారు.

అమాయకులైన యువకులకు కాసుల ఎరా గా వేసి ఎడాపెడా బ్యాంకు ఖాతాలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ముఠాలు మధ్య దళారులను సైతం రంగంలోకి దించి గ్రామీణ ప్రాంతాల్లో యువకుల తో బ్యాంక్ ఖాతాలు తెరిపించి వారి ఖాతాలతోనే బెట్టింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు.

ఇందుకు సంబంధించి పోలీసు లకు సైతం ఓ లింక్ దొరికింది. ప్రతిరోజు లక్షలాది రూపాయల టర్నోవర్ తో సాగె ఈ దందా లో బ్యాంకు ఖాతాలే అత్యంత కీలక అందుకే ఈ ముఠాలు ఇప్పుడు అద్దె ఖాతాల ను తెరమీదికి తెచ్చారు.

ఒక్కో యువకుడి పేరు మీద పదుల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. ఒక్కో ఖాతా ను రెండు మూడు నెలల వ్యవధి లో నే క్లోజ్ చేస్తున్నారు. ముంబయ్ .

హైదారాబాద్ కేంద్రం గా బెట్టింగ్ దందా లు సాగిస్తున్న ముఠాలు జిల్లాలో తమ దందా లను పక్క కార్యచరణ తో విస్తరిస్తున్నారు. పోలీసు నిఘా పెరుగుతున్న నేపథ్యం లో దందా సాఫీగా జరిగేలా ముఠాలు సైతం జాగ్రత లు తీసుకుంటున్నాయి.

బెట్టింగ్ నిర్వాహుకులు పోలీసులకు చిక్కిన నగదు దొరకకుండ జాగ్రత లు పడుతున్నారు. అందుకే బెట్టింగ్ లు ఎలాగో ఆన్ లైన్ లో సాగుతాయి. బెట్టింగ్ లు చేసే వారు నగదు ను ఆన్ లైన్ లోనే నిర్వాహకులు ఇచ్చే బ్యాంక్ ఖాతా లో వెయ్యాలి.

ఒక్కో రోజు లక్షల్లో నగదు బెట్టింగ్ ల రూపేణా వస్తుంది భారీ మొత్తాల్లో నగదు నిర్వాహకుల సొంత ఖాతాల్లో వుంటే పోలీసు దాడులు చేస్తే నగదు భారీగా కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే వీలైనన్ని బినామీ ఖాతాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పనిపాట లేని యువకులకు కాసులు ఎర వేసి వారి తో ఎప్పటికప్పుడు కొత్త ఖాతాలు తెరిపిస్తున్నారు.

ఆ ఖాతాల నిర్వహణ మాత్రం ముఠా ల చేతుల్లో వుంటాయి.ఒక్కో ఖాతా కు నెల కు కనీసం 15 నుంచి 20 వేల రూపాయలు యువకులకు చెల్లిస్తున్నారు. ఖాతా లు ఇచ్చే యువకులను గుర్తించ డానికి బెట్టింగ్ ముఠాలు దళారులను సైతం రంగంలోకి దించాయి బెట్టింగ్ సొమ్ము వేసుకోవడానికి ఖాతాలు ఇచ్చే యువకులను గుర్తించే పని ఈ దళారులు చేస్తున్నారు.

ఇందు కోసం దళారులకు సైతం ఒక్క ఖాతా ఇప్పిస్తే అయిదు వేలు నగదు చెల్లిస్తున్నారు. కోటి రూపాయల మేరకు టర్నోవర్ అయ్యాక ఆ ఖాతాల ను క్లోజ్ చేయిస్తున్నారు. ఒక్కో యువకుడు పేరుమీద పది ఖాతలు ఓపెన్ చేయిస్తున్నారు.

కాసుల లకు ఆశ ఆడుతున్న యువకులు బెట్టింగ్ ముఠా ట్రాప్ లో పడి యథేచ్ఛగా తమ బ్యాంకు ఖాతాలను ఇచ్చేస్తున్నారు. కాయ కష్టం చెయ్యకుండా ప్రతినెలా భారీ మొత్తం లో నే నగదు తమ చేతికి అందుతుండడం తో యువకులు సైతం ఇదే మజా లో ఉన్నారు.

ఇటీవలే ఓ బెట్టింగ్ ముఠా ను పట్టుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే అద్దె ఖాతాల ఉదంతం వెలుగులోకి వచ్చింది ఏడ్ పల్లి మండలం కు చెందిన అరడజన్ మంది యువకులను అదుపులో కి తీసుకోని విచారించడంతో అద్దె ఖాతాల వెనుక సాగుతున్న తతంగం వెల్లడి అయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!