HomeTelanganaNizamabadరాష్ట్ర సీనియర్ సాఫ్ట్ బాల్ మహిళల ఛాంపియన్ నిజామాబాద్

రాష్ట్ర సీనియర్ సాఫ్ట్ బాల్ మహిళల ఛాంపియన్ నిజామాబాద్

ఈనెల 7 నుండి 9 వరకు గీతా విద్యాలయం క్రీడా మైదానం జగిత్యాల లో జరిగిన 12వ రాష్ట్ర సీనియర్ సాఫ్ట్ బాల్ మహిళల ఛాంపియన్షిప్ పోటీలలో జిల్లా జట్టు సెమీఫైనల్ లో సిద్దిపేట జిల్లా జట్టుపై తలపడి 12-0 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్ కు చేరి, ఫైనల్ మ్యాచ్లో మహబూబ్నగర్ జిల్లా జట్టు పై తలపడి 03-0 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నమెంట్ ఛాంపియన్ గా నిలిచి ముగింపు

కార్యక్రమం ముఖ్య అతిథి సాఫ్ట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి కె శోభన్ బాబు గారి చేతుల మీదుగా ట్రోపీ మరియు పతకాలు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, హనుమకొండ సెక్రటరీ రాజేందర్, నల్గొండ కార్యదర్శి నాగిరెడ్డి, మెదక్ సెక్రెటరీ శ్యాంసుందర్ శర్మ, జగిత్యాల కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా జట్టుకు కోచ్ మేనేజర్లుగా అనికేత్ నరేష్,వినయ్, సుజాత మౌనికలు వ్యవహరించారు.

ఈ సందర్భంగా జిల్లా సాఫ్ట్ వాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ‌ వరుస విజయాలతో జిల్లా జట్లు రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరింత మంది క్రీడాకారులను తీర్చిదిద్దుతామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments