Thursday, April 16, 2026
HomeTelanganaNizamabadరోడ్డు భద్రతపై నిర్లక్ష్యం చేయొద్దు .. నిజామాబాద్ బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టాలి.. అర్బన్ ఎమ్మెల్యే...

రోడ్డు భద్రతపై నిర్లక్ష్యం చేయొద్దు .. నిజామాబాద్ బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టాలి.. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా..ఇందూరు:

రోడ్డు భద్రతపై నిర్లక్ష్యం చేయకుండా నిబంధనలు పాటించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం సుగుణ గార్డెన్ లో ” అర్రైవ్.. అలైవ్” కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేశంలో జరుగుతున్న మొత్తం ప్రమాదంలో 45 శాతం ద్విచక్ర వాహన ప్రమాదాలే జరుగుతున్నాయని పేర్కొన్నారు. రహదారులపై సూచించిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిబంధనలు అన్ని తెలిసినా..నిర్లక్ష్యం కారణంగానే అధిక ప్రమాదాలు జరుగుతాయన్నారు.

నిజామాబాద్ బస్టాండు ప్రయాణికుల తాకిడికి అనుగుణంగా నిర్మించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వినతి పత్రం అందజేశారు.

వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో మంత్రి స్పందిస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్టీసీ ఆర్ ఎం కు సమస్యపై దృష్టి సారించాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!