Thursday, April 16, 2026
HomeCRIMEఅక్రమ ఇసుక రవాణాపై ‘సీసీఎస్’ మెరుపుదాడి..

అక్రమ ఇసుక రవాణాపై ‘సీసీఎస్’ మెరుపుదాడి..

జిల్లాలో అక్రమ ఇసుక దందాయే లక్ష్యంగా పోలీసులు కొరడా ఝుళిపించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆదేశాల మేరకు బుధవారం సీసీఎస్ బృందం మెరుపుదాడి నిర్వహించి భారీ వాహనాలను స్వాధీనం చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. ఈ మేరకు సీసీఎస్ ఏసీపీ మస్తాన్ వలీ పర్యవేక్షణలో సిబ్బంది నిఘా పెట్టారు.

వేల్పూర్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్న రెండు 14 టైర్ల భారీ లారీలను (టిప్పర్లు)** పోలీసులు పట్టుకున్నారు. 2 (14 టైర్ల లారీలు), సెల్ ఫోన్లు: 2, ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

పట్టుబడిన వాహనాలతో పాటు డ్రైవర్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం వేల్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కు అప్పగించినట్లు ఏసీపీ తెలిపారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!