కాంటా అయిన ధాన్యం మిల్లకు వెళ్లేసరికి ధాన్యం బస్తాలలో తరుగు పేరిట వ్యత్యాసం వస్తుందని ఐకెపి కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో రైతులు వాగ్వాగ్దానికి దిగిన సంఘటన నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం కోడిచెర్ల గ్రామంలో చోటుచేసుకుంది.
రైతులు తెలిపిన కథనం ప్రకారం కొనుగోలు కేంద్రంలో కాంటా చేసిన ధాన్యం రైస్ మిల్లుకు చేరేటప్పటికీ ఒక్కో లారీకి 10 బస్తాల మేర తరుగు పేరిట వ్యత్యాసం వస్తుందని రైతులు తెలిపారు..
ఇదేమిటని ప్రశ్నిస్తే ధాన్యంలో పొల్లు ఎక్కువగా ఉండడం వల్ల వ్యత్యాసం వస్తుందని చెప్తున్నారనీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ముందే రైతులకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతూ దాటివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అదే గ్రామానికి చెందిన ఒక రైతు 85 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించి దానికి సంబంధించినటువంటి హమాలీ కూలీలను చెల్లించినప్పటికీ కొనుగోలు కేంద్ర నిర్వాహకులు 80 బస్తాలు మాత్రమే ట్రాక్ షీట్ పై రాయడంతో సదరు రైతు తాను హమాలీలకు చెల్లించిన కూలీల ఆధారంగా సదరు నిర్వాహకులను ప్రశ్నించగా 85 బస్తాలు కాటా నిర్వహించినట్టు బయటపడింది.
