19వ డివిజన్‌లో శ్రీ మహాలక్ష్మి ఆధ్వర్యంలోఅమ్మవారి బోనాల పండుగ భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు ఇందూర్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త ముఖ్య అతిథిగా హాజరై భక్తిపూర్వకంగా బోనం ఎత్తుకొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ గుప్త మాట్లాడుతూ “మహాలక్ష్మి అమ్మవారి బోనాలు తెలంగాణ సాంప్రదాయ సంస్కృతికి అద్దం పడుతున్నాయి.
ప్రజల ఐకమత్యం, భక్తి, సాంస్కృతిక విలువలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగలను మనందరం భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ,” అని తెలిపారు.ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మహిళలు బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రాంతమంతా భక్తి సందడితో నిండింది.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నాగోల్ల రవి , బిజెపి నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ , మరియు కంటేశ్వర్ మండల ప్రధాన కార్యదర్శి మేకల సాయి ప్రవీణ్ , ఎల్లమ్మ తల్లి మండల ప్రధాన కార్యదర్శి బెండ ప్రసాద్ , బిజెపి నాయకులు గుండు రవి , సాయిరాం , సాయిలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నరు..
