భారీ వరద నీటి ప్రవాహం తో పరవళ్లు తొక్కుతున్న మంజీరా లో మళ్ళీ ఇసుక తోడేళ్ల సందడి మొదలయ్యింది. అధికార పార్టీ పెద్దల నీడలో ఉన్న వారే ఇసుక అక్రమ దందా కు తెరలేపారు. తాత్కాలిక రోడ్లు వేశారు.
గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మాటున ఇసుక తరలించిన వారే ఇప్పడు అధికార పార్టీ కండువా వేసుకున్నారు. కానీ ఈసారి ఇందిరమ్మ ఇండ్ల ముసుగు లో అక్రమ దందా లో కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి భారీ స్కెచ్ వేశారు.
ఎప్పటిలాగే పోలీసులు రెవెన్యూ శాఖ లను కాసులతో తమ వైపు కన్నెత్త కుండా కట్టడి చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం కొడిచెర్లనుంచి నిజామాబాదులో ఇందిరమ్మ ఇళ్లకు అంటూ బుకాయిస్తూ ఇసుక ను తోడేస్తూ ఆ ఇసుక ప్రైవేటు వెంచర్లలో ఇసుక డెంపు చేస్తున్నారు ఈ వ్యవహారంపై పొతంగల్ రైతులు కదం తొక్కారు .
ఇసుక అక్రమ రవాణాకు కళ్లెం వేయాల్సిన రెవిన్యూ పోలీస్ శాఖలు రాచ మార్గాలు వేయడం ఫై రగిలి పోయారు రోడ్డెక్కారు అక్కేడే ఆ అధికారులను నిలదీశారు చెమటలు కక్కించారు వాస్తవానికి ఓ ప్రైవేటు రైతు చెందిన రెండు ఎకరాల భూమిలో ఇసుక మేట వేసింది.
ఈ ఇసుకమేట తొలగించడానికి మైనింగ్ శాఖ ను ఓ అధికార పార్టీ నేత దరఖాస్తు చేసాడు అసలే అధికారపార్టీ కదా అక్కడి అధికారులు ఎలాంటి క్షేత్ర పరిశీలన లేకుండా అనుమతులు ఇచ్చేసారు, కానీ ఆ రెండు ఎకరాల్లో ఇసుకమేట తొలగించే నేపం తో మంజీరా నది పరివాహక ప్రాంతంలో భారీ ఇసుక మెటల ను చెరబట్టాడు.
రెండు నెలల క్రితం ఉన్న వే బిల్లులతో ఈ అక్రమ ఇసుక దందా ను యథేచ్ఛగా సాగిస్తున్నారు ప్రైవేట్ భూమి లో ఇసుక మేటలు తియ్యడానికి అనుమతి ఇచ్చిన అధికారులకు అసలు తమకేమి సోయే లేదన్నట్లుగా ఉండిపోయారు దీనితో రైతులే తిరుబాటు చేసారు.
కోటగిరి వర్ని ల మీదుగా నిజామాబాద్, హైదరాబాద్ ల కు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. సోమవారం సాయంత్రం అక్రమంగా తప్పుడు వే బిల్లులతో తరలించకపోతున్న 20 ఇసుక టిప్పర్లను అడ్డుకొని అక్కడికి వచ్చిన అధికారుల నిలదీశారు సుమారు రెండు గంటలపైనే రోడ్డుపైనే బైఠాయించారు .
తమకు అవసరాల నిమిత్తం ఒక ట్రక్టర్ ఇసుక తీసుక వెళితే, ఒకవైపు పోలీస్ శాఖ, మరొకవైపు రెవిన్యూ శాఖ, ఇంకొక వైపు మైనింగ్ శాఖ దాడులు చేసి కాగితాలు ఉన్నాయా,? అనుమతులు ఉన్నాయా? అంటూ సవా లక్ష ప్రశ్నలు వేసి ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్లో పెట్టి నెలల తరబడి పెడుతున్నారని కేసు లు పెట్టి వేధిస్తున్నారని రైతులలు ఆక్రోశించారు అదే అనుమతుల ముసుగులో రోజు వందలది వాహనాల్లో ఇసుకఅక్రమ రవాణా అవుతుంటే ఎందుకు సోయి లేకుండా ఉన్నారని రైతులు నిగ్గదీసి అడిగారు.
మంజీరా నది నుంచి ప్రతి రోజు 20 ట్రిప్పర్ల పైగా భారీ లోడుతో ఇసుక తరలించకపోతే పొతంగల్ రోడ్డుపై ఇసుక టిప్పర్లను నిలిపివేసి నిరసన తెలిపారు. తప్పుడు వే బిల్లులతో అక్రమంగా తరలించకపోతున్న ఇసుక మాఫియా పై చర్యలు తీసుకోవాలంటూ రైతులు అధికారులకు డిమాండ్ చేస్తున్నారు. ఇష్ట రాజ్యాంగ అధిక లోడుతో ఇసుక తరలించకపోతే సంబంధిత శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ రైతులు నిలదీశారు.
ఇసుక మాఫియాకు అమ్ముడుపోయి అక్రమంగా ఇసుక తరలించడానికి సంబంధిత శాఖ అధికారులు ప్రత్యక్షంగా సహకరిస్తున్నారంటూ రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కళ్ళ ముందు నుంచే పెద్ద పెద్ద టిప్పర్లలో 60 టన్నులకు పైగా అక్రమంగా ఇసుక తరలించకపోతే అధికారులు మామూళ్లకు ఆశపడి అక్రమ ఇసుక తరలింపుకు సహకరిస్తున్నారని రైతులు మండిపడ్డారు రైతు వద్ద నుంచి రెండు ఎకరాల భూమిలో ఉన్న ఇసుక తీసుకువెళ్లడానికి అనుమతి పొంది 100 ఎకరాల్లో ఇసుక తీసుక వెళ్లడానికి రోడ్డు వేసుకుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు ..
నాలుగు గంటలుగా రోడ్డుపై ఇసుక టిప్పర్లను నిలిపివేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు . రైతులు లారీలను ఆపి నిరసన వ్యక్తం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న కోటగిరి ఎస్సై సునీల్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో చర్చించారు. అక్రమంగా వే బిల్లులు లేకుండా ఇసుక తరలించకపోతే రైతులు ఎస్సై ముందు తమ గోడు వినిపించారు. మైనింగ్ శాఖ ఏడి, తాసిల్దార్, ఇక్కడికి వచ్చి సరియైన సమాధానం చెప్పే వరకు తమ ఆందోళన ఆపమంటూ రైతులు భీష్ముంచుకొని కూర్చున్నారు. ఘటనా స్థలానికి తాసిల్దార్ గంగాధర్ చేరుకొని రైతులతో మాట్లాడారు స్థానికులు రైతులు తాసిల్దార్ గంగాధర్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు
