జిల్లా కేంద్రంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లను ఆహార భద్రత అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.పలు రెస్టారెంట్లలో నిషేధిత ఉప్పు, సింథటిక్ ఆహార రంగులు వాడుతున్నట్లుగా గుర్తించామని జిల్లా ఆహార భద్రత అధికారి సునీత తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రధానంగా పలు హోటల్ లో హానికర రంగులు వాడడం, పచ్చిమాంసం నిల్వ చేసినవి వాడుతున్నారని పేర్కొన్నారు.
దీంతో మాంసం కుళ్లిపోయే స్థితికి చేరుతోందన్నారు.అలాగే కొన్ని రెస్టారెంట్లు సరైన పరిశుభ్రత పాటించడం లేదని తెలిపారు.అలాగే పలు హోటల్ లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
