నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వృద్ధురాలు మెడలోంచి బంగారు గొలుసు చోరీ అయ్యింది. ఈ ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే..నగరంలోని సీతారాం నగర్ కాలానికి చెందిన గంగు భాయి సోమవారం ఉదయం గుండె నొప్పితో అస్వస్థత కు గుయ్యారు.దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని ప్రగతి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఈ మేరకు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు.అప్పటి వరకు మృతిరాలు మెడలో ఉన్న 18 గ్రాముల బంగారం గొలుసు కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ మేరకు కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యం ను నిలదీశారు.దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అడగగా ఆసుపత్రిలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
