Friday, April 17, 2026
HomeCRIMEమద్యం సేవించి రోడ్డు ఎక్కితే వేటే..డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 20 మందికి జైలు...

మద్యం సేవించి రోడ్డు ఎక్కితే వేటే..డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 20 మందికి జైలు శిక్ష..25 మందికి జరిమానా..

మద్యం సేవించి వాహనం నడుపుతు పట్టుబడ్డ 20 మందికి జైలు శిక్ష,25 మందికి జరిమానా విధించినట్లు నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 45 మంది పట్టుబడినట్లు తెలిపారు.

వారిని మంగళవారం వివిధ పోలీస్ స్టేషన్ లలో కౌన్సిలింగ్ నిర్వహించి అనంతరం జిల్లా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 25 మందికి మోటార్ వెహికల్ సవరణ చట్టం 2019 ప్రకారం జరిమానా విధించినట్లు తెలిపారు.

25 మందికి మొత్తం 2,32000 జరిమానా విధించినట్లు తెలిపారు. నగరంలోని మూడవ టౌన్ పరిధిలోని శివకుమార్ కు, 4 వ టౌన్ పరిధిలోని అశ్విన్, సాయికిరణ్, నవిపెట్ పి.యస్ పరిధిలోని కల్లెడ మోహన్, అఖిలేష్ లకు 4 రోజుల జైలు శిక్ష ,అలాగే మక్లూర్ పి.యస్ పరిధిలోని యేనుగంటి అభినయ్ గౌడ్,రూరల్ పి.యస్ పరిధిలోని కిషన్ గౌడ్, శివాజీ @ సుమకాంత్, ముగ్‌పాల్ పి.యస్ పరిధిలోని చిట్టి నారాయణ,లకు రెండు రోజుల జైలు శిక్ష, ముగ్‌పాల్ పి.యస్ పరిధిలోని బుసా భాను చందర్ 3 రోజుల జైలు శిక్ష, ముగ్‌పాల్ పి.యస్ పరిధిలోని కేతావత్ మహాపాత్లాల్ 7 రోజుల జైలు శిక్ష, డిచ్‌పల్లీ పి.యస్ పరిధిలోని రాథోడ్ జైసింగ్, 4 రోజుల జైలు శిక్ష, ఇందల్వాయి పి.యస్ పరిధిలోని కాట్రోత్ రవి, 7 రోజుల జైలు శిక్ష, ఇందల్వాయి పి.యస్ పరిధిలోని లబ్దియ నర్సయ్యకు 4 రోజుల జైలు శిక్ష, జక్రాన్‌పల్లి పి.యస్ పరిధిలోని కస్తూరి రాజశ్వర్, మేకల భావి 2 రోజుల జైలు శిక్ష, సిరికొండ పి.యస్ పరిధిలోని బొమ్మల గంగ రాజు , దారగుల శ్రీనివాస్, బోడస్ బాలకృష్ణ,సీతపల్ల గణేష్ లకు 4 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదనీ హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!