HomePOLITICAL NEWSAndhra Pradeshఏపీ లో భారీ ఎన్ కౌంటర్ ….మరో సారి అగ్ర నేతలు హతం …..మృతుల్లో హిద్మ...

ఏపీ లో భారీ ఎన్ కౌంటర్ ….మరో సారి అగ్ర నేతలు హతం …..మృతుల్లో హిద్మ ?

ఏపీ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి లో మంగళవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కాల్పుల మోతతో మారేడుమిల్లి అటవీప్రాంతం దద్దరిల్లింది. ఈ ఎన్‌కౌంటర్ కు సంబంధించిన వివరాలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. లోతట్టు అటవీప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేతలు ఆశ్రయం పొందుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం 6-7 గంటల సమయంలో పోలీసులు – మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు చెప్పారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హిద్మా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.కానీ ఇంకా పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు ఘటనా స్థలంలో తుపాకులు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇటీవల ఛత్తీస్ ఘడ్ లో తీవ్ర నిర్బంధం నేపథ్యలో అగ్ర నేతలు ఏపీ కి వలస వెళ్లారు. కానీ హిద్మ ను లక్ష్యంగా చేసుకొని గాలింపు జరుపుతున్న ఛత్తీస్ ఘడ్ పోలీసులకు పక్క సమాచారం రావడంతో ఏపీ లతో పాటు కేంద్ర బలగాల లతో కల్సి స్పెషల్ ఆపరేషన్ చేపట్టి హిద్మ ను అంతం చేసారని సమాచారం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments