కేవలం తన పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాక, సరిహద్దు దాటి వెళ్లి, మత్తు మాఫియా గుట్టు రట్టు చేసి గంజాయి మాఫియాకు సింహస్వప్నంలా మారిన ఓ లేడీ సింగం అధికారిణి, తన ధైర్య సాహసాలతో, పక్కా వ్యూహంతో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా గుట్టును రట్టు చేశారు.
యువత జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న మాదకద్రవ్యాల మాఫియాపై మోపాల్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ ధైర్యశాలి మహిళా సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) సుస్మితా ఉక్కుపాదం మోపి తన ధైర్య సాహసం, వ్యూహం కలగలిపిన ఓ మెరుపు దాడిలో, అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాకు చెందిన కీలక సూత్రధారులను అరెస్టు చేసి, కోట్లాది రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నగర శివారులోని మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోపాల్ సుస్మిత ఆకస్మిక దాడి చేసి ఆ నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించింది. దీంతో అతనికీ కేసు నమోదు చేసి గంజాయిని ఎక్కడ నుంచి తీసుకువచ్చి విక్రయిస్తున్నారని విచారణ చేపట్టారు.దీంతో సదరు నిందితుడు మహారాష్ట్ర నుంచి తీసుకువస్తున్నట్లు ఒప్పుకోవడతో నేరుగా ఎస్ఐ తమ బృందాన్ని అత్యంత గోప్యంగా సిద్ధం చేశారు.
హుటాహుటిన తమ బృందంతో నేరుగా మహారాష్ట్ర వెళ్లి తనిఖీ చేయగా, స్మగ్లర్లు గంజాయిని దాచిన విధానం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ అత్యంత నాణ్యమైన గంజాయి బయటపడింది.
దాడి చేసి ముగ్గురు కీలక స్మగ్లర్లను ఎస్ఐ సుస్మిత ధైర్యంగా నిలువరించి అదుపులోకి తీసుకున్నారు.ఎస్ఐ చూపిన ధైర్యం, నిబద్ధత, మహిళా అధికారిగా ఆమె పనితీరు పోలీసు శాఖకు గర్వకారణమని ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు. యువతను కాపాడటానికి నిరంతరం ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని కొనియాడారు.
