నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో గుప్త నిధుల తవ్వకాల ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు..
ఘన్పూర్ గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం కొందరు నిమ్మకాయలు, పసుపు, కుంకమ చల్లి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే అక్కడికి చేరుకుని ఐదుగురిని పట్టుకుని వర్ని పోలీస్ స్టేషన్లో అప్పగించారు.దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
