ఇద్దరు భార్యలు కలిసి తమ భర్తపై డీజిల్ పోసి కాల్చి హతమార్చారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం దేవక్కపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మాలావత్ మోహన్(38)కు ఇద్దరు భార్యలు.
కుటుంబ కలహాలతో మోహన్ పై ఇద్దరు భార్యలు డీజిల్ పోసి కాల్చి చంపారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
