HomeCRIMEఎమ్మెల్యే భూపతి రెడ్డి మీద కేసు నమోదు చేయాలిబీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

ఎమ్మెల్యే భూపతి రెడ్డి మీద కేసు నమోదు చేయాలిబీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

ఈ రోజు బీజేపీ జిల్లా బృందం అదనపు డీసీపీ శ్రీ బస్వారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించరు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ ఎమ్మెల్యే భూపతి రెడ్డి జిల్లా రాజకీయాలను నేరస్థుల మాదిరిగా నడుపుతున్నారు.

కబ్జాలు, మొరం–ఇసుక దందాలు, లంచగొండి వ్యవహారాలు మాత్రమే కాదు… ఇప్పుడు బహిరంగంగా గుండాయిజం, రౌడీయిజం కూడా పెంచుతున్నారని ఆరోపించారు.నిన్న పాల్ద గ్రామం లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో భూపతి రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తూ “సన్నబియ్యం, ఉచిత కరెంట్ ఇస్తున్నాం” అని చెప్పినప్పుడు అక్కడే ఉన్న యువకులు– సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది,– కరెంట్ బిల్లు మేమే కడుతున్నాం,అని నిజం చెప్పగానే ఎమ్మెల్యే భూపతి రెడ్డి మండిపడి,ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు…

వారిని తరిమేయండి”అంటూ బహిరంగంగా రెచ్చగొట్టారని తెలిపారు.ఎమ్మెల్యే మాటతో కాంగ్రెస్ గుండాలు అక్కడే యువకులపై దాడికి చేశారాని చెప్పారు.“బీజేపీ నాయకుల మీద రౌడీయిజం చేస్తే చూసి ఊరుకునే పరిస్థితి లేదు.

భూపతి రెడ్డి గారు హద్దులు దాటుతున్నారు. కబ్జాలు మొరం దంద చేస్తున్న నాయకులను వెంట వేసుకొని దాడులు చేయిస్తున్నారు అన్నారు రూరల్ లో భూపతి రెడ్డి మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేక పెరిగింది అన్నారు అడగడగునా mla ను అడ్డుకుంటే సహనం కోల్పోతున్నారు

అన్నారు ఇటువంటి దాడులకు బీజేపీ నాయకులు బయపడరని అన్నారు నీ పద్ధతి మార్చుకోకుంటే రూరల్ నుంచి తరిమె రోజు దగ్గరలోనే ఉందన్నారు జిల్లా పోలీస్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే, పెద్ద ఎత్తున బీజేపీ ధర్నాలు, ఆందోళనలు జరుగుతాయి.అన్నారు అడుగడుగునా భూపతి రెడ్డి ని అడ్డుకుంటాం.

”అన్నారుయువకులపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ రౌడీలపై వెంటనే కేసు నమోదు చేయాలివారిని రెచ్చగొట్టి దాడులు చేయించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్న పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ వెంటనే భూపతి రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.

బలహీన వర్గాలపై దాడులు చేస్తూ MLA అహంకారం ప్రదర్శిస్తే ప్రజలు కూడా చూస్తూ ఉండరు” అని అన్నారు.గతం లో TRS నాయకులు కూడా ఇలాగే రౌడీయిజం చేసి చివరకు ప్రజల కోపం ఎలా ఎదుర్కొన్నారు చూసాం.

అలాగే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు కూడా అదే గతి పడుతుంది అన్నారు తమ అహంకారం తగ్గించుకోవాలి” అని దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, జగన్ రెడ్డి,కార్పొరేటర్ ప్రమోద్,శంకర్, జిల్లా అధికార ప్రతినిధి శంకర్ రెడ్డి,ఆనంద్, ఆమందు విజయ్ కృష్ణ,జిల్లెల శ్రీనివాస్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments