స్థానిక సంస్థల ఎన్నికల్లో నుంచే కాంగ్రెస్, బీజేపీ పతనం మొదలవుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేయడంలో నిజామాబాద్ జిల్లాదే కీలక పాత్ర కావాలన్నారు.
నిజామాబాద్ జిల్లాను బీ ఆర్ఎస్ కంచుకోటగా అభివర్ణించి కాంగ్రెస్ పతనాన్ని ఇందూరు గడ్డ నుంచే శాసిస్తామన్నారు. నవంబర్ 29న దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లపై చర్చించడానికి బుదవారం నగరంలోనీ బీ ఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రసాధన కోసం కేసీఆర్ చావునోట్లో తలపెట్టి ఆమరణదీక్షకు దిగిన చారిత్రిక నవంబర్29 ’దీక్షా దివస్’ స్పూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షస పాలనపై సమరశంఖంపూరిద్దామని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీలు గాల్లో కలిసి పోయాయని, 420 హామీల అమలు ఊసే లేదని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాతలు పెట్టేందుకు సమయం ఆసన్నమైందన్నారు. రేవంత్ పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని, పల్లెల్లో పాలన పడకేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా తాను, పార్టీ జిల్లా ముఖ్య నేతలంతా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకూ హైదరాబాద్ వెళ్లకుండా జిల్లాలోనే ఉంటామని, అన్ని ఎన్నికల్లో వంద శాతం తో బీఆర్ఎస్ విజయం సాధించేలా కృషి చేస్తామని ఆయన అన్నారు.
వేలాది మందితో పెద్ద ఎత్తున “దీక్షా దివస్ “నవంబర్ 29న నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వేలాది మందితో “దీక్షా దివస్ “ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని జీవన్ రెడ్డి వెల్లడించారు.
ప్రతీ మండలం నుంచి వందమందికి పైగా బీ ఆర్ఎస్ నేతలు, రావాలని పిలుపు ఇచ్చారు., 5వేల మందితో దీక్షా దివస్ జరుగుతుందని, ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తమన్నారు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామని, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్థామని , ఆసుపత్రుల్లో పాలు, పంపిణీ చేస్తామని వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, వీజీ గౌడ్,బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
