నిజామాబాద్ జిల్లా నవీపేట్ పోలీస్ స్టేషన్పరిధిలో మల్కాపూర్ గ్రామంలో ఈ నెల 24న జరిగిన మహిళ హత్య కేసును నిజామాబాద్ నార్త్ రూరల్ సర్కిల్ పోలీసులు వేగంగా, వివిధ కోణాల్లో పరిశీలించి, విచారించి, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసిపి రాజా వెంకటరెడ్డి తెలిపారు.
ఈ మేరకు బుదవారం నిందితుడు కుమరం @ పాండవల సాగర్, పోలీసులు అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు గృహ నిర్మాణానికి డబ్బులు అవసరం కావడంతో, తన మేనకోడలు ఆకుల అనంత @ సోనీ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించాలనే ఉద్దేశంతో ఈ నెల 24 న ఆమె ఇంటికి వెళ్ళినట్లు తెలిపారు.
ఆ సందర్భంలో ఆమె ఒంటరిగా ఉండడంతో, ఆమెను గొంతు నులిమి హత్య చేసి, చెవుల్లో ఉన్న కమ్మలు, మాటిలు, మెడలో ఉన్న బంగారు పుస్తెలు తాడు దొంగలించినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ఇంటి లోపలి గదిలో దాచివేసి, బంగారంలో కొంత భాగం (కమ్మలు 1.5 గ్రాములు) ముత్తూట్ ఫైనాన్స్, బోధన్ బస్ స్టాండ్ బ్రాంచ్లో తాకట్టు పెట్టి రూ 12,500/- రుణం పొందాడు.
మిగిలిన మాటి, పుస్తెలు తాడు (13.5 గ్రాములు) తన వద్దే ఉంచుకున్నాడు. సంఘటన వెలుగులోకి రాగానే పారిపోయిన నిందితుని, బుదవారం ఉదయం నిజామాబాద్ బస్ స్టేషన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.నిందితుడి వద్ద నుండి ఒక బంగారు మాటి (1.5 గ్రా), పుస్తెలు తాడు (13.5 గ్రా), కీప్యాడ్ మొబైల్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ కేసు చేధనకు నిజామాబాదు ఎ. సి. పి రాజా వెంకట్ రెడ్డి నేత్రుత్వం లో నిజామాబాదు నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్ అధ్వర్యంలో టీం లుగా ఏర్పడి , కేసును వివిధ కోణాలలో పరిశోధించి ఇట్టి హత్య కేసులో నిందితులు గా ఉన్న కుమరం @ పాండవల సాగర్ తండ్రి పోశెట్టి ను పట్టుకున్నారు.
నిందితులను పట్టుకున్న ఎస్సే లు తిరుపతి, యాదగిరిగౌడ్, , గఫార్ ఏ ఎస్సే, రాజేశ్వర్ క్రైమ్ టీమ్ & నవీపేట్ పిఎస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందిoచారు.
