ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ప్రాణాల మీదకు వచ్చింది. ఈ ఘటన దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే..దేవునిపల్లి పరిధిలోని రామేశ్వరం పల్లి కి చెందిన రాజశేఖర్ ను అదే గ్రామానించిన చెందిన ప్రవీణ్ అనే యువకుడు కత్తితో పొడి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.దీంతో వెంటనే స్థానికులు రాజశేఖర్ ను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అలాగే నిందితుడైన ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
