HomeTelanganaNizamabadరెండవ విడత లోనూ అదే జోరు..196 సర్పంచ్ స్థానాలకు 1178 నామినేషన్ లు ..

రెండవ విడత లోనూ అదే జోరు..196 సర్పంచ్ స్థానాలకు 1178 నామినేషన్ లు ..


రెండవ విడత ఎన్నికలోనూ నామినేషన్ల పర్వం అదే జోరుగా సాగింది. రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. అధికార యంత్రాంగం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దశలో మొత్తం 196 సర్పంచ్ స్థానాలకు గాను 1,178 నామినేషన్ స్వీకరణ పొద్దు పోయేవరకు కొనసాగింది.

ఈ విడతలో మొత్తం 1,760 వార్డు స్థానాలకు గాను అభ్యర్థులు ఏకంగా 3,764 నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం నామపత్రాల స్క్రూటినీ ఉంటుంది. 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదేరోజు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటించి గుర్తులను కేటాయిస్తారు. డిసెంబర్ 14న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది.

మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు.

నేడు తొలి విడత ఉపసంహరణ ..

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్ని కల నిర్వహణలో భాగంగా ఇప్పటికే నామినేష న్ల స్క్రూటినీ పూర్తికాగా బుధవారం ఉపసంహరణ ప్రక్రియను చేపట్టనున్నారు. బోధన్ రెవెన్యూ డివిజన్ లోని పది మండలాలతోపాటు నిజామా బాద్ డివిజన్ పరిధిలోని నవీపేట మం డలంలోని 184 సర్పంచ్ స్థానాలకు 1156 నామినేషన్లు, 1642 వార్డు సభ్య స్థానాలకు 3,526 నామినేషన్లు దాఖ లైనట్లు స్క్రూటినీ తరువాత అధికారులు తేల్చారు.

బుధవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 3 గంటలలోగా నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం కల్పించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments