HomePOLITICAL NEWSUncategorizedఅధ్వానంగా చంద్రశేఖర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ

అధ్వానంగా చంద్రశేఖర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ

నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సమీర్ అహ్మద్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు అజరుద్దీన్ అదనపు కమిషనర్ ని కలిసి, వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చంద్రశేఖర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం మరియు రోడ్లు అత్యంత అధ్వాన్నంగా మారడం వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ అన్నారు.


డ్రైనేజీ సమస్యలు: కాలనీలో మురుగునీరు రోడ్లపైకి చేరుకుని, దుర్వాసనతో పాటు దోమలు, అంటువ్యాధులు పెరిగేందుకు కారణమవుతోందని నాయకులు వివరించారు.


రోడ్ల దుస్థితి: రోడ్లు పూర్తిగా గుంతలమయమై, వర్షాకాలంలో మరింతగా పాడైపోతున్నాయని, దీనివల్ల ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ సమస్యలను తక్షణమే గుర్తించి, మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో త్వరగా కొత్త డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని మరియు పాడైన రోడ్లను పునరుద్ధరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.


స్థానిక ప్రజల పక్షాన ఈ సమస్యల పరిష్కారానికి తమ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, తదుపరి చర్యల కోసం సిద్ధంగా ఉన్నామని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments