రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా లో ఇందూరు జిల్లాకు అన్యాయం జరిగిందనీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పేర్కొన్నారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ విఫల పాలనపై మండిపడి, ప్రజలకు నిజాలు తెలియచేస్తాన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన కానీ నామమాత్రంగా కూడా అభివృద్ధి కనిపించడం లేదనీ పేర్కొన్నారు. మోసాలు, అవినీతి, నిర్లక్ష్యం మాత్రమే పెరిగాయి” అని ఆరోపించారు.
జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీకు ఎటువంటి పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదు.సారంగాపూర్ ఫ్యాక్టరీ పూర్తిగా పాడైపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదనీ అన్నారు.తెలంగాణ యూనివర్సిటీకి ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదన్నారు.
ఇది అభివృద్ధి కాదు… జిల్లావారిని మోసం చేసే పాలన” అన్నారు.
విమానాశ్రయం విషయంలో కాంగ్రెస్ నేతల తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అన్నారు మన నిజామాబాదుకు ఎయిర్‌పోర్ట్ విషయం మాట్లాడకుండా ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ ఇస్తే వెళ్లి సీఎంకు సన్మానం చేసిన జిల్లా కాంగ్రెస్ నేతలు సిగ్గు పడాలి” అని ఆయన ధ్వజమెత్తారు. “జిల్లా ప్రయోజనాలు పక్కనబెట్టి, అధికారపక్షం మురికి రాజకీయాలకు నమస్కారం చేసే వాళ్లను ప్రజలు చూడటం లేదు” అన్నారు.గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతోనే
ఇప్పటి గ్రామాల్లో కనిపిస్తున్న లైటింగ్ నుంచి రోడ్‌ల వరకు… ప్రతి చిన్న అభివృద్ధి పని కూడా కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులతోనే జరుగుతోంది. గ్రామీణాభివృద్ధి అంటే కేంద్రం—రాష్ట్రం వాటా దాదాపు కనబడడం లేదు” అని అన్నారు.
గ్రామాల బడ్జెట్, స్మార్ట్ స్ట్రీట్‌లైట్స్, పి.ఎం గ్రామ సడక్ యోజన, జల జీవన్ మిషన్—ఈ ప్రతిదీ కేంద్ర ప్రభుత్వమే నడిపిస్తున్నది” రేషన్ బియ్యం కేంద్రం ఇస్తుంది అన్నారు అని ఆయన వివరించారు. నిజాయితీగా పనిచేసే సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి
ధర్మానికి కట్టుబడి, ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే సర్పంచ్ అభ్యర్థులను మీరు గెలిపించాలనీ సూచించారు.
ఆ వ్యక్తులే మీ గ్రామానికి అభివృద్ధి తెస్తారు. పార్టీ కంటే ప్రజల సేవ ముఖ్యమని భావించే నాయకుల్ని ముందుకు తేవాలి” అన్నారు.
జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన నాయకులు అవినీతిలో మాత్రం ముందున్నారు. నియోజకవర్గ అభివృద్ధి మీద శ్రద్ధ ఏమాత్రం లేదుగాని, అక్రమాల మీద మాత్రం 24 గంటలూ వ్యూహాలు వేసుకుంటున్నారు” అని ఆయన విమర్శించారు.
ఈ సమావేశం లో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకార్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ, మాస్టర్ శంకర్, యాదల నరేష్, అమందు విజయ్ కృష్ణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
