Thursday, April 16, 2026
HomeCRIMEద్విచక్ర వాహన చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్..ఐదు బైకులు స్వాధీనం.

ద్విచక్ర వాహన చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్..ఐదు బైకులు స్వాధీనం.

నగరంలో ద్విచక్ర వాహనాల చోరి చేస్తున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసినట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. నిజామాబాద్ నగరంలో జరుగుతున్న మోటార్ సైకిల్ చోరీలను అరికట్టేందుకు టౌన్–I పోలీసులు ప్రత్యేక పహారా పర్యవేక్షణ చేపట్టారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.

సీసీ కెమెరా ఫుటేజీలు, టెక్నికల్ ఎవిడెన్స్ మరియు ఇంటెలిజెన్స్ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నామన్నారు. స్వాధీనం చేసిన బైక్లు కేసులకు సంబంధించినవని నిర్ధారించారు.

బోధన్ మండలంలోని రకాసిపేట్ కు చెందిన ఆమీర్ ఖాన్ , కమారెడ్డి అద్లూర్ గ్రామం డ్రైవర్స్ కాలనీకి చెందిన మొహమ్మద్ హనీఫ్
నిందితులను మంగళవారం న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు న్యాయ పరిరక్షణ కు పంపినట్లు తెలిపారు.

ఆస్తి నేరాలను అరికట్టేందుకు పహారా, పర్యవేక్షణ, ప్రత్యేక దర్యాప్తు చర్యలను మరింత బలోపేతం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వాహనాలకు పటిష్టమైన లాక్స్ ఉపయోగించాలని, అనుమానాస్పద వ్యక్తులు గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!