ఎల్లారెడ్డి. మండలంలోని సోమార్పేట్ గ్రామంలో ట్రాక్టర్ తో ఢీ కొట్టి అత్యాయత్నానికి పాల్పడ్డ ఘటనపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరా తీశారు..
సోమవారం మండలంలోని సోమార్పేట్ గ్రామంలో సర్పంచ్ బిట్ల రాజు తో పాటు నలుగురు మహిళలు గంజి భారతి, బండమీది బాలమ్మ, పద్మ సత్యవ్వ, తోట శారద, చిన్నారి గంజి అద్విక్ పై ట్రాక్టర్ తో ఢీ కొట్టి సర్పంచ్ గా గెలిచిన కురుమ పాపయ్య తమ్ముడు చిరంజీవి హత్యయత్నానికి పాల్పడ్డాడు.
ఈ సంఘటనపై సోమీర్పేట్ గ్రామస్తులతో పాటు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, పార్టీ శ్రేణులు నాలుగున్నర గంటల పాటు రాస్తారోకో జరిపి ఆందోళన నిర్వహించారు. సిరిసిల్ల లో ఉన్న కేటీఆర్ కు సమాచారం అందింది.
దీంతో కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో సెల్ఫోన్లో మాట్లాడారు. బాధితుల పరిస్థితిపై సురేందర్ ను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి జరుగుతున్న చికిత్సలు, హైదరాబాద్ కు తరలించిన వారి వివరాలు, సంఘటనకు సంబంధించిన విషయాలను మాజీ ఎమ్మెల్యే అని అడిగి కేటీఆర్ తెలుసుకున్నట్లు సమాచారం.
గెలిచిన సర్పంచ్ అభ్యర్థి పాపయ్య తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్ తో ఢీ కొట్టి హతమార్చాలని ప్రయత్నించిన విషయాన్ని కేటీఆర్ కు వివరించినట్లు మాజీ ఎమ్మెల్యే చెప్పారు. ఈ విషయంపై కేటీఆర్ తీవ్ర ఆందోళన చెందారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండాయిసానికి బెదిరొద్దని, తాను అండగా ఉంటానని కేటీఆర్ ప్రకటించినట్లు ఆయన చెప్పారు.
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుని చిన్నాన్ననే ఇంత దుర్మార్గానికి దిగబడడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉండాలని, అవసరమైతే వారిని కలిసి ఎందుకు ఎల్లారెడ్డి కి వస్తానని కేటీఆర్ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాదులో ఉన్న బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్లనున్నట్లు మాజీ ఎమ్మెల్యే చెప్పారు.
వెంటనే జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో సైతం కేటీఆర్ మాట్లాడినట్లు మాజీ ఎమ్మెల్యే చెప్పారు. అధికార పార్టీకి చెందిన వారిని ఉపేక్షించే రాదని, నిందితులను కఠినంగా శిక్షాలనించాలని జిల్లా ఎస్పీకి కేటీఆర్ కోరినట్లు మాజీ ఎమ్మెల్యే చెప్పారు.
