తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు,బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి గారిని ఈ రోజు మంగళవారం ఉదయం టీయూడబ్ల్యూజె(ఐజేయు) తరపున మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగింది..ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యల గురించి ప్రస్తావించడం జరిగింది.
జర్నలిస్టుల దీర్ఘకాల సమస్య అయిన ఇండ్ల స్థలాల అంశాన్ని సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు..అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వెంటనే ఆర్డీవో గారితో పోన్లో మాట్లాడి జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం భూ సేకరణ చేయాలని ఆదేశించారు..
— ఎడ్ల సంజీవ్, జిల్లా అధ్యక్షులు, TUWJ – IJU, Nzb
