Sunday, April 26, 2026
HomeLaw and Orderఉత్తమ పోలీసులకు సేవా పతకాలు..

ఉత్తమ పోలీసులకు సేవా పతకాలు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా పోలీస్ శాఖలో విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలువురికి మహోన్నత సేవ పతకం , ఉత్తమ సేవ పతకం , సేవ పతకాలకు అర్హులు అయినటువంటి వారి జాబితాను విడుదల చేశారు.

ఈ మేరకు నిజామాబాద్ జిల్లాకు చెందిన స్పెషల్ బ్రాంచ్ ఎస్సై ఎస్.సంతోష్ రెడ్డి కి మహోన్నత సేవా పతకం లభించింది. అలాగే నాగభూషణం ఏఎస్ఐ ఇందల్వాయి పిఎస్, షేక్ గఫర్ ఏఎస్ఐ నవీపేట్ పిఎస్, జగదీశ్వర్, హెడ్ కానిస్టేబుల్ :1345 , స్పెషల్ బ్రాంచ్ లకు ఉత్తమ సేవా పతకం లు లభించాయి.

బి శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నార్త్ రూరల్ సర్కిల్, బాదావత్ శివరాం ఎస్సై సిసిఆర్బి, ఏ ఆనంద్ సాగర్ ఎస్సై విఆర్, ఖాన్ హబీబ్ ఎస్సై బోధన్ టౌన్ పిఎస్, పి రాజేశ్వర్ ఎస్సై వి ఆర్, వడ్డే ఉదయ్ కుమార్ ఎస్సై టౌన్ 4 పి ఎస్, సంజీవ రావు ఎస్సై మహిళా పోలీస్ స్టేషన్ , విట్టల్ రావు ఎస్సై సిసిఎస్ పిఎస్, రాజేందర్ ఏఎస్ఐ నందిపేట్ పిఎస్, ఎండి అబ్దుల్ రహీం ఏఎస్ఐ 1 టౌన్ పి. ఎస్., పసుపుల రాజేశ్వర్ హెడ్ కానిస్టేబుల్ 1362 మహిళా పోలీస్ స్టేషన్, పోచమ్మ కాడి మోహన్ హెడ్ కానిస్టేబుల్ సి సి ఎస్ పి ఎస్, బెగ్ బిస్మిల్లా ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ 82 హెడ్ క్వార్టర్, కథావత్ రామారావు కానిస్టేబుల్ 1860 ఇందల్వాయి పి ఎస్ , చాట్ల సుభాష్ కానిస్టేబుల్ 1852 సిసిఎస్ పి.ఎస్ లకుసేవా పతకములు సత్కరించారు.

ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా పోలీస్ శాఖలో వివిధ పతకములు సాధించిన సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ప్రజలకు మరింత చేరువై బాధ్యతాయుతముగా నిబద్ధతతో మీరు అందించిన సేవలు ప్రశంస నియమామని మీ కృషి వల్ల పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందని ఈ విజయాలు ఇతర సిబ్బంది కూడా ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.

అలాగే భవిష్యత్తులో కూడా ఇదే సేవాభావంతో క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు, సమాజానికి మరింత గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!