Friday, April 24, 2026
HomeCRIMEఅప్రమత్త తో తప్పిన అనార్థం .........పటిష్టమైన పెట్రోలింగ్ తో రెండు చోట్ల ఆగిన లూటీ లు...

అప్రమత్త తో తప్పిన అనార్థం ………పటిష్టమైన పెట్రోలింగ్ తో రెండు చోట్ల ఆగిన లూటీ లు ………వరుస ఉదంతాలలో విమర్శలు వెల్లువ

దొంగల అలజడి ఫై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.పోలీసులు అప్రమత్తంగా వుండడం తో రెండు వరుస ఉదంతాలలో ఆర్థిక అనర్థాలు తప్పాయి.

పటిష్టమైన పెట్రోలింగ్ వుంటే ఎలాంటి విపత్తులైన అధిగమించవచ్చని స్పష్టం అయింది. మూడో టౌన్ ఏరియా లో శుక్రవారం తెల్లవారు జామున గణేష్ జ్యువెలరీ షాప్ షెటర్ ధ్వసం చేసే టైం లోనే పోలీస్ పెట్రోలింగ్ జిప్ రయ్యాన సైరన్ తో దూసుక రావడంతో దొంగలముఠా పరుగులు తీసింది.

లేదంటే విలువైన ఆభరణాలు చోరీ అయ్యేది. అంతకు రెండు రోజుల ముందే నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడి ఏరియా లో బుధవారం తెల్లవారు జామున ఏటియం చోరీ యత్నం కేసు లో పోలీసు లు సూపర్ స్పీడ్ వుండడం వల్లే ఏటియం లూటీ కి యత్నించిన హర్యానా ముఠా పోలీసులకు చిక్కింది ఇప్పటికే కీలక పురోగతి సాధించారు.

చోరీ కి యత్నించింది హర్యానా ప్రాంతానికి చెందిన ముఠా గా గుర్తించారు వీరు గతంలో అనేక కేసుల్లో నిందితులుగా గుర్తించారు హర్యానా నుంచి జహీరాబాద్ వచ్చిన ఈ ముఠా మొదట బొలోరో వాహనం చోరీ చేశారు ఆ వాహనం నెంబర్ ను మార్చేసి నెల్లూరు జిల్లా కు చెందిన ఓ బైకు నెంబర్ ప్లేట్ ను ఫిక్స్ చేసారు అదే వాహనం లో నిజామాబాద్ జిల్లాకు వచ్చారు కానీ అనూహ్యంగా ఏటియం ను లూటీ చెయ్యకుండా నే పోలీసులు ఎంట్రీ కావడంతో పారి పోయారు. కానీ ఆ టైం లోనూ సీపీ పెట్రోలింగ్ లో ఉన్న వాహనాలను పరుగులు పెట్టించడంతో ముఠా ఎట్టకేలకు చిక్కింది.

నిజానికి వారం రోజుల క్రితం నగరంలో రెండు ప్రాంతాల్లో రాజస్థాన్ ముఠా రెండు ఏటియం లను లూటీ చేసి నిప్పటించింది. కానీ ఆ రోజు రాత్రి పెట్రోలింగ్ బృంధాలను పురమాయించే నాధుడే లేకుండే అందుకే ముఠా దర్జాగా జిల్లా దాటేసి వెళ్ళింది. వెంటాడి హర్యానా ముఠా ను పట్టుకోవడంతో మరిన్ని కొంత మేరకు ఊపిరి పీల్చుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!