Saturday, April 18, 2026
HomeTelanganaNizamabadఅర్బన్ ఓటర్ల జాబితా ఫై రాజకీయ రగడ ......భారీఎత్తున అక్రమాలంటూ బీజేపీ ఆందోళన ......

అర్బన్ ఓటర్ల జాబితా ఫై రాజకీయ రగడ ……భారీఎత్తున అక్రమాలంటూ బీజేపీ ఆందోళన ……

మున్సిపల్ ఎన్నికల కోసం కసరత్తులు మొదలు పెట్టిన ఎన్నికల సంఘం వోటర్ల జాబితా ముసాయిదా ను అందుబాటులోకి తెచ్చింది.మొదటి రోజే అర్బన్ వోటర్ల జాబితా ఫై రాజకీయ రగడ మొదలయ్యింది.

అర్బన్ వోటర్ల జాబితా పూర్తిగా తప్పుల తడక గా వుందంటూ బీజేపీ ఆందోళనకు దిగింది బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ స్వయంగా రంగంలోకి దిగాడు కార్పొరేషన్ కమిషనర్ ను కలిసి నివేదించాడు. కార్పొరేషన్ లో బీజేపీ గెలవబోతుందనే కాంగ్రెస్ కుట్ర చేస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వోటర్ల జాబితా లో పొరపాట్లకు తావు ఇవ్వని అధికారులుఅర్బన్ లో ఎందుకు అక్రమాలకు ఆస్కారం ఇస్తున్నారనేది బీజేపీ వాదనరాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాలో .

స్థానిక ఓటర్లను పక్కనపెట్టి ఇతర జిల్లాల కు చెందిన వారుపేర్లు అర్బన్ వోటర్ల జాబిత లో ఎలా వచ్చాయనేది బీజేపీ అనుమానం. అర్బన్ వోటర్ల జాబితా లో నగరానికి చెందిన 60 మంది వోట్లు గల్లంతు అయ్యాయంటూ బీజేపీ రాద్ధాంతానికి దిగింది.

ఆర్మూర్ కామారెడ్డి హైదారాబాద్ నాందేడ్ ప్రాంతాలకు చెందిన వారి పేర్లు అర్బన్ ఓటర్ జాబితా లో ఎలా ఉన్నాయని నిలదీస్తుంది.. స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేమన్న భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు తెరలేపిందని విమర్శించారు..

ఇందూరు మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం తప్పదనే భయంతోనే ప్రభుత్వం ఇలాంటి గందరగోళానికి పురికొల్పుతోంది” అని ఆయన ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎటువంటి లోపాలు లేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ను హఠాత్తుగా బదిలీ చేయడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

“సమర్థవంతంగా పనిచేస్తున్న అధికారిని అర్ధాంతరంగా మార్చడం వెనుక ఉన్న మర్మమేంటి? అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం లేదనే కారణంతోనే ఆయనను సాగనంపారా?” అని ప్రశ్నించారు.

ఓటర్ల జాబితాలో లోపాలపై మున్సిపల్ కమిషనర్‌ను నిలదీయగా.. “ప్రభుత్వం పంపిన లిస్టును మేము కేవలం డౌన్లోడ్ చేశాం” అని సమాధానం ఇవ్వడం విచారకరమన్నారు. అధికారులకు జవాబుదారీతనం లేకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అక్రమాలపై ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో చర్చించినట్లు దినేష్ తెలిపారు. త్వరలోనే నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని, తక్షణమే తప్పుడు జాబితాను రద్దు చేసి, సవరించిన ఓటర్ల జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!