Saturday, April 18, 2026
HomeCRIMEసిరికొండ లో చైన్ స్నాచింగ్

సిరికొండ లో చైన్ స్నాచింగ్

పట్టణ ప్రాంతాలకు పరిమితం అయిందనుకున్న చైన్ స్నాచింగ్ లు మారుమూల ప్రాంతాలకు పాకింది వ్యవసాయ పనులు చేస్తున్న మహిళా మెడలో నుంచి ఓ దుండగుడు పుస్తెల తాడు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం సిరికొండ మండలం పూసల తండా లో జరిగింది.

పూసల తండా కు చెందిన పులి బుచ్చమ్మ శుక్రవారం తన పంట పొలం లో పనిచేస్తుండగా సిరికొండ వైపు నుంచి బైకు మీద వచ్చిన యువకుడు రోడ్డు మీద బైక్ పార్క్ చేసి కొద్దీ దూరంలో ఉన్న బుచ్చవ్వ వద్ద వెళ్లి ఎదో అడగడానికి వచ్చినట్లుగా చేసి ఆమె మెడలో నుంచి గొలుసు ఎత్తుకొని పరుగెత్తి బైకు మీద మాయం అయ్యాడు బాధితురాలు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిరికొండ వైపు బైకు ల మీద వచ్చిన వారి ని సీసీ కెమెరాలో చూస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!