కస్తూర్బా పాఠశాలలో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఈ సంఘట శుక్రవారం రాత్రి పదిన్నర గంటల లకు సిద్దిపేట్ మండలం మిట్ట పల్లి లో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన గుర్రం తిరుపతి రెడ్డి, శ్రావణి దంపతుల కుమార్తెలు వర్షా, హర్షిని లు సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి కస్తూర్బా పాఠశాలలో చదువుతున్నారు.
వర్షా తొమ్మిదో తరగతి చదువుతుండగా, హర్షిని (11) ఏడో తరగతి చదువుతోంది. రోజులాగే శుక్రవారం రాత్రి భోజనం చేసిన అనంతరం స్నేహితులతో కలిసి హాస్టల్లో ఆడుకుంటున్న హర్షిణి ఒక్కసారిగా కింద పడిపోవడంతోఅప్రమత్తం అయిన సిబ్బంది హుటాహుటిన సురభి మెడికల్ కాలేజ్ కు తరలించగా, అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని తెలపడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు .
అనంతరం పాప డెడ్ బాడీని సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీకి పోస్టుమార్టం కు తరలించారు. పాప మృతి పై అనుమానం లేదని, తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, రెండు సంవత్సరాల క్రితం ఆమెను స్కూల్ లో చేర్చినట్లు పాప తండ్రి తిరుపతి రెడ్డి తెలిపారు.
