ప్రియుడి మోజులో పడి భర్త ను హత్య చేసింది. అందుకు సుపారి గ్యాంగ్ సహాయం కూడా తీసుకుంది మొదట నిద్రమాత్రలు ఇచ్చి ఆ తర్వాత గొను నులిమి హత్య చేసింది.
మరుసటి రోజు అతని ది సహజ మరణంగా అందరిని నమ్మించింది. హడావుడిగా అంత క్రియలు చేసింది కానీ ఇజ్రాయిల్ లో ఉన్న తమ్ముడికి అనుమానం వచ్చింది. ఉన్నపళంగా ఫొటో లు తెప్పించుకొని అన్ లైన్ లోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీనితో పోలీసులు రంగంలోకి దిగి పూడ్చేసిన మృతదేహం ను వెలికి తీసి మరోసారి పోస్టు మార్ట్రం నిర్వహించారు తమ్ముడు చెప్పిన నట్లుగానే గాయాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంకేముంది పోలీసులు తమదైన స్టయిల్ లో భార్య నుంచే విచారణ మొదలు పెట్టారు కాల్ డేటా తీశారు దీనితో మృతి మీద మిస్టరీ వీడింది తమ్ముడి అనుమానం నిజం అయింది అన్న ను భార్యే ప్రియుడు మోజులో పడి హత్య చేసినట్లుగా నిర్దారణ అయింది .
నిజానికి భర్త ను హత్య చేయడానికి ఆమె గత కొంత కాలంగా స్కెచ్ వేస్తూ వస్తుంది మొదట కారు తో ఢీకొట్టే ప్లాన్ వేసింది కానీ అది బెడిసి కొట్టింది. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం బోర్గాం గ్రామంలో ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి గత శుక్రవారం మృతి చెందాడు. రమేష్ అకస్మాత్తుగా మరణించడంతో, కుటుంబ సభ్యులు అది గుండెపోటుగా పేర్కొంటూ హుటాహుటిన అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, ఇజ్రాయెల్ లో ఉపాధి నిమిత్తం ఉంటున్న రమేష్ తమ్ముడికి ఈ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అన్న ఆరోగ్యంపై అప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు లేవని, అకస్మాత్తుగా గుండెపోటు అని చెప్పి అంత్యక్రియలు పూర్తి చేయడం వెనుక ఏదో మతలబు ఉందని అతను భావించాడు. దీంతో తన అన్న మృతి పై అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తూ బాధితుడు ఇజ్రాయెల్ నుంచే పోలీసులను ఆశ్రయించాడు.
ఈ ఫిర్యాదును గంభీరంగా తీసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. నిజానిజాలు నిగ్గుతేల్చాలంటే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడం తప్పనిసరి అని నిర్ణయించారు. తహశీల్దార్ (ఎమ్మార్వో) సమక్షంలో ఖననం చేసిన రమేష్ మృతదేహాన్ని బయటకు తీసారు . అక్కడికక్కడే ఫోరెన్సిక్ నిపుణులతో పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం పూర్తి చేసారు.
