జిల్లా జైలు నుంచి సెంట్రల్ జైలు గా మారిన మునుపటి వాసనలు ఇంకా వదిలించుకోలేక పోతుంది. అధికారుల కాసుల కక్కర్తె జైలు ప్రతిష్ఠ మసకబారేలా చేస్తుంది. పరివర్తన కోసం జైలు కు వచ్చిన ఓ ఖైదీ ని ముందు పెట్టి అధికారులు అక్రమాలకు తెరలేపారు.
మత్తు పదార్థాలు యథేచ్ఛగా జైలు లోకి దర్జాగా వెళ్తున్నాయి. తాము విధి నిర్వహణ లో నిక్కచ్చిగా వుంటా రూల్స్ పక్కాగా పాటిస్తా అంటూ ప్రవచనాలు వల్లించే ఓ అధికారి ఇవన్నీ తానున్న జైలు లోనే జరుగుతున్నా పట్టించుకోలేని నిస్సహాయ స్థితి లో వుండడం ఫై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.క్రమశిక్షణకు, కట్టుదిట్టమైన భద్రతకు మారుపేరుగా ఉండాల్సిన నిజామాబాద్ కేంద్ర కారాగారం ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
జైలు గోడల మధ్య అధికారుల అక్రమాలు, ఆగడాలకు తెగబడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జైలులో ఖైదిలుండే బ్యారక్ ల వద్ద గంజాయి దొరికిన ఉందంతం కలకలం రేపుతుంది. అసలు గంజాయి ని ఎవరికి లోపలి కి తెచ్చారు ఆ టైమ్ లో డ్యూటీ లో ఎవరున్నారు ? వంటి కీలక అంశాలు గాలికి వదిలేసి ఒకరిద్దరు ఖైదీలపై ప్రతాపం చూపడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ములాఖత్ లకు వచ్చే వారైనా అధికారులను కలవడానికి వచ్చే వారినైన క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అక్కడి భద్రత ఏర్పాట్లు చుస్తే చీమ కూడా వెళ్లడం కష్టమే కానీ మత్తు పదార్థాలు ఎలా వెళ్తున్నాయనేది ఎవరికి అంతు చిక్కడం లేదు.
పటిష్టమైన భద్రత వ్యవస్థ సైతం అపహాస్యం అవుతుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది ప్రశ్న ! సౌకర్యంగా ఉండే బ్యారక్ రుచికరమైన భోజనం లాంటి వ్యవహారాల్లో లావాదేవీలు అనేది ఆనవాయితీ గానే వస్తుంది కానీ ఏకంగా కరుడు గట్టిన ఖైదీ ని ముందు పెట్టి ఇద్దరు అధికారులు సాగిస్తున్న అక్రమాలు తంతు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
నగరానికి చెందిన భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు జైలు అన్నీ తానై అక్రమ దందాలకు తెరలేపాడనేది బెయిల్ ఫై బయటికి వచ్చిన నింధితులు చెప్తున్న సమాచారం. ఎలాగో నేరం చేసిన వారే కావడంతో వారిమీద ఎవ్వరికి సానుభూతి వుండదు. వారేది చెప్పినా ఎవ్వరూ పట్టించుకోరనే ధీమా తో అధికారులుసైతం ఇలాంటి దందా లపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు.
