అధికారులకు ఆదేశం నగరంలోని 2వ డివిజన్ పరిధిలోని బోర్గం (కె) గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కొనసాగుతున్న నిర్మాణ పనులను దగ్గరుండి చూసిన అనంతరం, అక్కడి సూపర్వైజర్తో మాట్లాడి పనుల నాణ్యత ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన ముడి పదార్థాలను వాడాలని, పనుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు.అనంతరం గ్రామంలోని ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులతో సమావేశమయ్యారు.
ఇళ్ల నిర్మాణ పురోగతిపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం అంబేడ్కర్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు వారి కమిటీ హాల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పలు విన్నపాలను అందజేశారు.
గ్రామ కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి రామకృష్ణ పార్టీకి మరియు గ్రామానికి అందిస్తున్న సేవలను గుర్తించి, వారిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోర్గం (కె) అధ్యక్షులు రాజు, నాయకులు మట్ట రాము, నగేష్, నవీన్ గౌడ్, కాంతయ్య, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
