ఎట్టకేలకు నిజామాబాద్ సెంట్రల్ జైలు లో అక్రమాలు ఫై ఉన్నతాధికారులు మత్తు వదిలారు యథేఛ్ఛ సాగుతున్న అక్రమాల ఫై వరుస కథనాలు మీడియాల్లో రావడంతో ఉన్నతాధికారులు మొద్దు నిద్ర వదిలారు అధికారం హుటాహుటిన వచ్చిన వారు రోజంతా విచారణ చేశారు.
విచారణ లో ఏ ఏ విషయాలు బయటికి వచ్చాయనేది గోప్యంగానే వుంచారు. కానీ అధికారులకు మాత్రం క్లిన్ చిట్ ఇచ్చారంటూ జైలు వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. జిల్లా జైలు నుంచి సెంట్రల్ జైలు గా మారిన మునుపటి వాసనలు ఇంకా వదిలించుకోలేక పోతుంది.
కానీ వరుస వివాదాలతో జైళ్ల శాఖ ప్రతిష్ట మసక బారుతుండడాన్ని వారు ఆక్షేపించారని సమాచారం. ఎవరెవరిని విచారించారనేది బయటికి పొక్కనీయడం లేదు. జైలు ఆవరణ లో పనిచేస్తున్న ఒకరిద్దరు శిక్ష పడిన ఖైదీలను లోపలే పనిచేయించాలని సూచించారట..శిక్ష పడిన ఓ ఖైదీ కేంద్రంగా అక్రమ దందాలు సాగుతున్నాయని చెప్తున్నారు .
మత్తు పదార్థాలు యథేచ్ఛగా జైలు లోకి దర్జాగా వెళ్తున్నాయి. తాము విధి నిర్వహణ లో నిక్కచ్చిగా వుంటా రూల్స్ పక్కాగా పాటిస్తా అంటూ ప్రవచనాలు వల్లించే ఓ అధికారి ఇవన్నీ తాను విధుల్లో ఉన్న జైలు లోనే జరుగుతున్నా పట్టించుకోలేని నిస్సహాయ స్థితి లో వుండడం ఫై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
అందువల్లే నిజామాబాద్ కేంద్ర కారాగారం ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.. జైలులో ఖైదిలుండే బ్యారక్ ల వద్ద గంజాయి దొరికిన ఉందంతం కలకలం రేపుతుంది. అసలు గంజాయి ని ఎవరికి లోపలి కి తెచ్చారు ఆ టైమ్ లో డ్యూటీ లో ఎవరున్నారు ? వంటి కీలక అంశాలు గాలికి వదిలేసి ఒకరిద్దరు ఖైదీలను కొట్టడమే వివాదంగా మారింది.
జస్ట్ ఈ అంశానికే విచారణ పరిమితం చేసారనే ప్రచారం జరుగుతుంది ములాఖత్ లకు వచ్చే వారి నుంచి నయానో భయానో వసూలు చేయడం అంతటా ఉన్నదే కానీ యథేచ్ఛగా మత్తు పదార్థాలు జైలు లో వెళ్తుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది .
అధికారులకు క్లిన్ చిట్ ఇచ్చిన నప్పటికీ ఉన్నతాధికారులు వేగంగా స్పందించి సెంట్రల్ జైలు కు రావడం అక్రమార్కులకు వణుకు పుట్టించింది
