HomeTelanganaNizamabadమున్సిపల్ పీఠంపై కాషాయ జెండా ఖాయం.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ధీమా.....

మున్సిపల్ పీఠంపై కాషాయ జెండా ఖాయం.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ధీమా.. పార్టీలో భారీగా చేరికలు.. కండువా కప్పి ఆహ్వానించిన నేతలు..

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు.

మాజీ కార్పొరేటర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో 4వ డివిజన్‌కు చెందిన పలువురు కీలక నేతలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దినేష్ పటేల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల వైఫల్యాలతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు.

గత పాలకుల అవినీతి, నిర్లక్ష్యం కారణంగా నగరాభివృద్ధి కుంటుపడిందని, ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి రాబోయే ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, పేదల అభ్యున్నతికి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని పెంచాయని ఆయన అన్నారు.

ఈ విశ్వాసంతోనే అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ వైపు వస్తున్నారని తెలిపారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామని, క్రమశిక్షణతో పనిచేసి కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

పాంగ్ర గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బీమ్ సింగ్, స్థానిక నాయకులు ఎల్ఐసీ శ్రీనివాస్ తమ అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. వీరికి దినేష్ పటేల్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఓం సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకర్ లక్ష్మీనారాయణ, రూరల్ మండల అధ్యక్షులు ఆనంద్, శ్రీకర్ తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments