HomeTelanganaNizamabadట్రాన్స్‌జెండర్ కి కార్పొరేటర్‌గా అవకాశం ఇవ్వండి: నగర కాంగ్రెస్ అధ్యక్షుడికి వినతి

ట్రాన్స్‌జెండర్ కి కార్పొరేటర్‌గా అవకాశం ఇవ్వండి: నగర కాంగ్రెస్ అధ్యక్షుడికి వినతి

నగర పాలక సంస్థలోని 11వ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని ట్రాన్స్‌జెండర్ జరీనా బేగం కోరారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిజామాబాద్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణను కలిసి ఆమె తన దరఖాస్తును అందజేశారు.

ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని, అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్షన్ సభ్యులుగా నియమించాలని నిర్ణయించి వారికి రాజకీయ గుర్తింపునిచ్చారని గుర్తు చేశారు.

అదే స్ఫూర్తితో నిజామాబాద్‌లో జరీనా బేగం దరఖాస్తు చేసుకున్నారని, ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తగిన ప్రాధాన్యత కల్పించేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్లు అర్చన, ఆమలలతో పాటు కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్, టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లని శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments