HomeTelanganaNizamabadఅధికార పార్టీలో దరఖాస్తుల సందడి .........టికెట్ ల కోసం పోటెత్తుతున్న ఆశావహులు

అధికార పార్టీలో దరఖాస్తుల సందడి ………టికెట్ ల కోసం పోటెత్తుతున్న ఆశావహులు

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో అధికార పార్టీనేతల్లో సందడి మొదలైంది. రిజర్వేషన్ పక్రియ కొలిక్కి రాకముందే ఆ పార్టీ కి దరఖాస్తుల తాకిడి మొదలయింది. టికెట్ల కోసం ఆశావహులు కాంగ్రెస్ కార్యాలయానికి పోటెత్తుతున్నారు.

గత రెండు రోజులుగా అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ కు పదుల సంఖ్య లో టికెట్ దరఖాస్తులు వచ్చాయి. సర్వే ఆధారంగానే గెలుపు గుర్రాలకు టికెట్ లు వస్తాయని స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జిల్లా పర్యటన లో పార్టీ నేతలకు స్పష్టం చేసారు.

జూనియర్ సీనియర్ తేడా లేదని కేవలం గెలుపు ప్రామాణికంగా టికెట్ కేటాయింపు ఉంటుందని తెగేసి చెప్పారు. పదేళ్ల తరవాత పార్టీ అధికారంలోకి రావడంతో ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో సానుకూల ఫలితాల ఫై కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం తో ఉన్నారు.

బిఆర్ యస్ ప్రభుత్వ హయాంలో వరుసగా రెండు సార్లు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ బొక్కబోర్లా పడింది సింగిల్ డిజిట్ కు పరిమితం అయింది.అందులో ఓ కార్పొరేటర్ బిఆర్ యస్ లోకి జంప్ అయ్యాడు.రెండు పర్యాయాలు నా మాత్రంగా కూడా పోటీ ఇవ్వలేక పోయింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ను కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు అయినప్పటికీ ఈసారి ఎన్నికల్లో బిఆర్ యస్ నా మాత్రంగా మారింది ఏ డివిజన్ లలోను గట్టి పోటీ ఇచ్చే స్థితి లో లేదు కానీ ఆయా డివిజన్ లలో బీజేపీ బలంగా ఉంది.అందుకే ఈసారి మున్సిపల్ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారబోతున్నాయి. అందుకే కాంగ్రెస్ నేతల్లో గెలుపు ఆశలు చిగురించాయి.

20 నుంచి 25 స్థానాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయనేది పార్టీ వర్గాల అంచనా అందుకే యంఐయం తో కలిసి ఎలాగైనా మేయర్ స్థానం దక్కించుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. పార్టీ అధికారం లో ఉన్న నేపథ్యంలో కార్పొరేటర్ గా గెలవడం నల్లేరు మీద నడకగా భావిస్తున్న నేతలు మున్సిపల్ బరిలోకి దిగడానికి సిద్ధం అవుతున్నారు.

అందుకే డివిజన్ ల రిజర్వేషన్ పక్రియ పూర్తీ కాకుండానే నేతలు టికెట్ లకోసం కాంగ్రెస్ ఆఫీస్ లకు దారి పట్టారు తమ సీనియార్టీ ని పరిగణలోకి తీసుకోని టికెట్ ఇవ్వాలంటూ దరఖాస్తులు చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మైనార్టీ నేతలు సైతం పోటీ ఆసక్తి చూపుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments