Monday, May 4, 2026
HomeTelanganaNizamabadపోరాడే వాడు రక్షకుడు..సేవ చేసే వారు నాయకుడు

పోరాడే వాడు రక్షకుడు..సేవ చేసే వారు నాయకుడు

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లో 7 వ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ అభ్యర్థి మున్సిపల్ లైసెన్స్ ఇంజనీరు బంటు రాము పోటీకి సిద్ధం అంటున్నారు.35 సంవత్సరాలుగా మున్సిపల్ లైసెన్స్ ఇంజనీరుగా ప్రజలకు సేవచేస్తూనే జిల్లా ప్రజలకు సుపరిచితుడయ్యాడు .

ప్రస్తుత మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వేషన్లు బీసీ జనరల్ గా రావడం తో ప్రత్యక్ష రాజకీయాల ద్వారా 7 వ డివిజన్ ప్రజలకు మరింత సేవ చెయ్యాలన్న లక్ష్యం తో బీజేపీ టికెట్ ఆశిస్తూ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారీ కి తన దరఖాస్తు పత్రాన్ని అందజేశారు.

35 సంవత్సరాలు మున్సిపల్ రంగం లో అన్ని విభాగాలపై పట్టు సాధించి, పని మీద కార్యాలయానికి వచ్చిన వారికితన వంతు సహకారాన్ని అందిస్తూ ప్రజల మెప్పు పొందుతూ మరింత ముందుకు సాగాలని ఆశిస్తున్నారు.

కాలని సమస్యల పై సంపూర్ణ అవగాహన కలిగి పార్లమెంట్ సభ్యులు అరవింద్,అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సహకారం తో కాలని అభివృద్ధికి ఎంతో దోహదం చేశారని కాలని వాసులు చెబుతున్నారు.

బంటు రామును బీజేపీ కార్పొరేట్ అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన గెలుపులో మేమంతా ఐక్యంగా ఉండి ఆయన విజయం లో కీలక పాత్ర పోషించి బీజేపీ ఖాతాలో 7 వ డివిజన్ ను కానుకగా ఇస్తామని కాలనీ ప్రజలు చెబుతున్నారు.

ప్రజల ఆశీర్వాదం ఉన్న తనకు బీజేపీ పార్టీ కార్పొరేటర్ టికెట్ కేటాయిస్తే ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురవేయడం లో తను సైతం సమీదగా బీజేపీ కోసం పని చేస్తానని బంటు రాము పేర్కొన్నారు.తనకు టికెట్ ఇచ్చి కార్పొరేటర్ అయ్యే అవకాశాన్ని కల్పించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!