నిర్దేశించిన సమయం దాటిన తర్వాత కూడా వ్యాపార సంస్థలను తెరిచి ఉంచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు.ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
ఈ నెల 16న రాత్రి 11 గంటల సమయంలో మాలపల్లి ఏరియాలోని ‘న్యూ సవేరా’ హోటల్‌ను అనుమతించిన సమయం కంటే అదనంగా తెరిచి ఉంచి వ్యాపారం సాగిస్తున్నారు. దీనివల్ల స్థానికంగా న్యూసెన్స్ ఏర్పడటమే కాకుండా శాంతిభద్రతలకు ఆటంకం కలుగుతోందని గుర్తించిన పోలీసులు హోటల్ నిర్వాహకుడు షేక్ మెయిన్ (44) పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈరాజు నిందితుడిని మంగళవారం స్పెషల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, నేరం నిరూపణ కావడంతో గౌరవ జడ్జి గారు నిందితుడికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. కోర్టు ఉత్తర్వుల మేరకు నిందితుడిని జైలుకు పంపినట్లు తెలిపారు.పట్టణంలో ఎవరైనా నిర్ణీత సమయం మించి దుకాణాలు, హోటళ్లు తెరిచి ఉంచినా..
బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం చేశారు.
