Tuesday, April 21, 2026
HomeTelanganaNizamabadఅసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తో అర్వింద్ గుణపాఠం నేర్పం . ముగ్గురు ఎంపీ లను ఓడించిందే...

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తో అర్వింద్ గుణపాఠం నేర్పం . ముగ్గురు ఎంపీ లను ఓడించిందే బిఆర్ యస్ …. బాజిరెడ్డి గోవర్ధన్

అసెంబ్లీ ఎన్నికల్లో అర్వింద్ ను ఓడించి మంచి గుణపాఠం నేర్పించమని మరో ముగ్గురు ఎంపీ లను కూడా బిఆర్ యస్ పార్టీ ఓడించిందని బిఆర్ యస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆయన శనివారం నిజామాబాద్ నగరంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోమాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో నూ అర్వింద్ కు ఓటమి తప్పదన్నారు. ఎంపీ గా గెలిచి న అరవింద్ ఈ ఐదేళ్లలో నిజామాబాదు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.

గెలిచిన తరువాత ఒక్కసారి కూడా గ్రామాల్లో రాలేదని ప్రజలు ఆగ్రహం తో ఉన్నారని,ప్రజల కోసం పార్లమెంట్ లో ఒక్కసారి కూడా గొంతెత్తలేదన్నారు.తనకు కాంగ్రెస్ పార్టీ తోనే అంటూ అర్వింద్ మేకపోతు గాంబీర్యం చూపుతున్నారని గోవర్ధన్ మండిపడ్డారు . అరవింద్ నిన్న మిగిత ముగ్గురు ఎంపీ అభ్యర్థిలను ఓడించింది బీఆర్ఎస్ పార్టీనే అని గుర్తుంచుకోవాలి అని ఆయన అన్నారు .

బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు కావాలనే మతరాజకీయాలు చేస్తున్నాయిముస్లిం సమాజం ఆలోచించాలన్నారు కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థి .ని పోటీ కి నిలపకుండా అరవింద్ లోపాయికారి గా రేవంత్ రెడ్డి తో ఒప్పందం చేసుకున్నారని ఇందులో భాగంగానే జగిత్యాల్ కు చెందిన జీవన్ రెడ్డి కి అసలు ఇష్టం లేకపోయినా పోటీ కి దింపారన్నారు. .కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో బీ ఆర్ ఎస్ ఓడిపోయిందని తెలిపారు. కరీంనగర్ పెద్దపల్లి రైల్వే లైన్ కూడా మాజీ ఎంపీ కవిత తీసుకొచ్చారని,అరవింద్ చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు.

ప్రజలు ఆశీర్వదించి ఎంపీ గా ఎన్నికైన తరువాత కరీంనగర్ నుంచి ముంబై కి రైలు తీసుకొస్తా, బోధన్ నుంచి బీదర్ కు రైల్వే లైన్ తేసుకొస్తా అని హామీ ఇచ్చారు.ప్రజలు కచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు కర్రుకల్చి వాత పెడతారన్నారు . ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీ జీ గౌడ్. జెడ్పి ఛైర్మెన్ విఠల్ రావు,మేయర్ నితు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!