పేదల ఉసురు తగిలి రేవంత్ సర్కార్ పతనం అవ్వడం ఖాయమని బీజేపీ అభ్యర్థి అర్వింద్ అన్నారు ఆయన శనివారం మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు.
కల్యాణ లక్ష్మి, మహాలక్ష్మి, పింఛన్ల పెంపు, రైతులకు బోనస్ తదితర ఫ్రీ హామీలిచ్చి ప్రజలను రేవంత్ సర్కార్ మోసం చేసింది.. వారి ఉసురు తగిలి త్వరలోనే సర్కార్ కూలిపోతదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాని రేవంత్ మోడీ మీద మాట్లాడుతున్నరన్నరు .
దేవుడు గుడి లో వుండాలి భక్తి మనసు లో వుండలంటూ రేవంత్ చేస్తున్న వ్యాఖ్యల మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. హిందువులకు సూక్తులు ఇవ్వడం బంద్ చెయ్యాలన్నారు.
ముస్లిం లవిషయంలోనూ ఇలాంటి సలహాలు ఇవ్వాలన్నారు.రద్దయిన ఉగ్రవాద సంస్థలు, కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం ఏమిటని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టెర్రరిస్టులు రాజ్యమేలుతారని… ప్రజల్లో మార్పు రావాలని ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు.
అసలు దేశం ఎటుపోతుందని… దేశ భద్రతపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రజలకు సమాధానం చెప్పి తర్వాతనే ఓట్లు అడగాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే ఎన్నికలివనీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఎన్నికలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి కానీ ఇవి నరేంద్ర మోడీ ఎన్నికలు అని చెప్పారు
