జాన రమేష్: ( ఇది సంగతి; ఆర్మూర్:)
వైద్యో నారాయణ హరీ అని పిలిపించుకునే వైద్యలు వెలకట్టలేని ప్రాణలకు సులువుగా వేల కట్టేసి చేతులు దులుపేసుకుంటున్నారు. ఎంతో పవిత్రమైన .
వైద్య వృత్తి కి మచ్చను మిగులుస్తున్నారు.నిజామాబాద్ నగరం ఆర్మూర్ పట్టణంలోని కొందరు డాక్టర్ల నిర్వాహకులఫై సగటు రోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.ప్రాణాంతక వ్యాధుల బారీన పడి చికిత్స కోసం వచ్చి ప్రాణాల వదిలేసారంటే అర్థం చేసుకోవచ్చు.
గ్రామాల్లో మంత్రసానులు ఆడుతూపాడుతూ చేసే డెలివరీ కోసం వచ్చే వారిని ప్రాణాలు గాలిలో కలిపేస్తున్నారు. నిలువెత్తు నిర్లక్ష్యానికి నాలుకు కార్చుకొని మరో నాలుగు రు వైద్యులను కూడాబాల్కోని బేరం మొదలు పెట్టి పోయిన ప్రాణాలకు ఖరీదు కట్టేసి ఎప్పటిలా దందాలు సాగిస్తున్నారు.
నిజామాబాద్ నగరంలో కాలూర్ గ్రామానికి చెందిన గర్భిణీ మహిళా మృత్యువాత పడితే వైద్యులంతా కలసి ఎడతెగని సమాలోచనలు జరిపి …చివరికి బేరాలు చేసి పది లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. తాజాగా ఆర్మూర్ లోనూ ఇదే స్టయిల్ లో మృతురాలు కుటింబీకులకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేసి రాజీ చేసుకున్నారు.
ఊపిరి పోయాల్సిన డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం పోతే చాలు… నిర్లజ్జగా పరిహారం ఇచ్చేస్తున్నారు. ఆర్థికంగా చితికిపోయిన పేదల ప్రాణాలకు ఖరీదు కట్టి చేతులు దులుపుకుంటున్నారు. బాధ్యతగా ఉండాల్సిన పెద్ద మనుషులుగా చాలామణి అవుతున్న వారు సైతం వైద్యులకే వత్తాసు పలుకుతూ బాధిత కుటుంబాల్లో కన్నీటిని మిగులుస్తున్నారు.
ఒక్కోసారి బాధితుల బంధువులను సైతం బెదిరించి విషయం బయటకు పోక్కకుండా బౌన్సర్లతో దాడికి దిగిన సందర్భాలు సైతం లేకపోలేదు. ప్రైవేటు బౌన్సర్లను ఆసుపత్రుల నిర్వాహకులు పెంచి పోషిస్తున్నారనే సంగతి బహిరంగ సత్యమని ప్రజలు చర్చించుకుంటున్నారు.
మాతా శిశు మరణాలను నిరోధించాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కనీసం కన్నేత్తి చూసిన పాపాన పోవడం లేదు. దీంతో ఆర్మూర్ పట్టణంలోని కొందరు పేరుగాంచిన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల ఆగాడాలు ఆడిందే ఆటగా… పాడిందే పాటగా తయారైంది పరిస్థితి.
తాజాగా శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని శ్రీ తిరుమల ఆసుపత్రిలో కల్లెడ గ్రామానికి చెందిన సుమలత అనే గర్భిణీ ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరగా, వైద్యుల నిర్లక్ష్యంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సుమలత ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
అక్కడికి వచ్చిన శంకర్ దాదాలు నచ్చజెప్పి ప్రయత్నం చేసి విఫలం కావడంతో మెల్లగా అక్కడి నుండి జారుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యుల బంధువులు శంకర్ దాదాల వాహనాన్ని అడ్డుకొని న్యాయం చేసే వరకు వదలమని హెచ్చరించారు.
దీంతో ఆందోళనకు దిగిన మృతురాలి బంధువులను రాజకీయ పలుకుబడి ఉపయోగించిన ఆర్మూర్ పట్టణంలోని శంకర్ దాదాల మాఫియా నాలుగు లక్షలకు ప్రాణానికి ఖరీదు కట్టి బాధితుల నోరు మూయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే గత నెల రోజుల క్రితం పట్టణంలోని ఓ పిల్లల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో 9 ఏళ్ల బాలుడు ప్రాణాన్ని కోల్పోయాడు.
అక్కడ కూడా ఇదే సీన్ కనిపించింది. సిండికేట్ గా మారిన కొందరు శంకర్ దాదాలు బాలుడి ప్రాణానికి వెలకట్టి మెల్లగా జారుకున్నారు. ‘ఆశ’తో ఆసుపత్రికి వస్తే ప్రాణాలు పోగొట్టుకున్న బాధితులు నోరు మెదపకుండా బౌన్సర్లతో భౌతిక దాడులకు దిగుతున్నారు.
‘లైఫ్’ మీద ఆశలు లేకుండా రోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఆర్మూరు పట్టణంలోని వైద్యుల జేబులు ‘సిరి’ సంపదలతో వర్ధిల్లుతుంటే, పేదవాడి ప్రాణాలకు మాత్రం హామీ దొరకడం లేదు. దీనిపై సంబంధిత జిల్లా వైద్య శాఖ అధికారులు స్పందించి ఈ శంకర్ దాదాల ఆగడాలకు అడ్డుకట్టువేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.