మావోయిస్టు పార్టీ కి సంస్థాగతంగామరో ఎదురు దెబ్బ తగిలింది.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు అగ్ర నేతలు తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు ఇందులో కేంద్ర కార్యదర్శి దేవిజి తో పాటు . మరో కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి తో సహా మరో పదహారు మంది మావోయిస్టు పార్టీ నాయకులు తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయారని ప్రచారం జరుగుతుంది.
ఇటీవల కర్రే గుట్టల్లో కేంద్ర బలగాలు అగ్ర నేతల ఆచూకీ కోసం వారం రోజుల పాటు జల్లెడ పట్టాయి.ఓ దశలో ఎన్ కౌంటర్ లో దేవ్ జి హతం అయ్యారంటూ ప్రచారం జరిగింది.
కానీ ఆ ప్రాంతంలో అన్ని వైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టూ ముట్టడం తో ఉక్కిరి బిక్కిరి అయినా మావోయిస్టు నేతలు లొంగిపోవడానికి సిద్ధం అయ్యారని సమాచారంజగిత్యాల జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ పగ్గాలు చేపట్టారు.
కేంద్ర కమిటీ సెక్రటరీగా ఉంటూ దేశవ్యాప్తంగా పార్టీ వ్యూహాలను ఆయనే రచించేవారు. ఆయన లొంగుబాటు తో మావోయిస్టు పార్టీకి కేంద్ర నాయకత్వమే సంక్షోభంలో పడింది.
