నగరంలో ఆస్తి పన్ను వసూళ్ల ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం ఉదయం నాందేవ్ వాడలోని జోన్-1 కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి, పన్నుల వసూలుపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరువలో ఉన్నందున, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని స్పష్టం చేశారు.క్షేత్రస్థాయి పర్యవేక్షణ: బిల్ కలెక్టర్లు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి, బకాయిదారులతో మాట్లాడి పన్నులు వసూలు చేయాలి.
దీర్ఘకాలికంగా పన్ను చెల్లించని వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని సూచించార ప్రజలు పన్నులు చెల్లించేందుకు వీలుగా అవసరమైన చోట ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పన్ను వసూళ్లలో అలసత్వం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో జోనల్ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
