Monday, April 20, 2026
HomeTelanganaNizamabadతెలంగాణ మహాసభలో మార్పు నినాదం..ధన్‌పాల్‌ను కలిసిన చక్కిలం బృందం..

తెలంగాణ మహాసభలో మార్పు నినాదం..ధన్‌పాల్‌ను కలిసిన చక్కిలం బృందం..

తెలంగాణ మహాసభ అధ్యక్ష ఎన్నికల వేళ నగరంలో రాజకీయ సందడి నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి మిడిదొడ్డి శ్యామ్ సుందర్ మద్దతుదారులు గురువారం నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. చక్కిలం రమణయ్య నేతృత్వంలో ప్రతినిధి బృందం ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి, శ్యామ్ సుందర్ విజయానికి సహకరించాలని, తమ వంతు కృషి చేస్తూ ఆశీర్వచనం అందించాలని కోరారు.

ఈ సందర్భంగా చక్కిలం రమణయ్య మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా అధ్యక్ష పదవిలో కొనసాగిన అమరవాది, మరోసారి నామినేషన్ వేయడం శోచనీయమన్నారు.

సంఘంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటే మార్పు తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. మహాసభలోని 1100 మందికి పైగా ఓటర్లకు రమణయ్య ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. “వాసవీ మాత బిడ్డలుగా ప్రతి ఒక్కరూ ధర్మం, న్యాయం వైపు నిలబడాలి.

ఆలోచించి ఓటు వేసి, ధర్మాన్ని గెలిపించే క్రమంలో మిడిదొడ్డి శ్యామ్ సుందర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ చిట్టి బాబు, చండికృపాల్ తదితరులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!